కరోనా ఎఫెక్ట్: ఫ్రీలాన్సర్స్‌కు పెరుగుతున్న డిమాండ్.. ఎంత పెరిగిందో తెలుసా?

ఫ్రీలాన్స్ ... ఈ పదం మరీ కొత్తదేమీ కాదు. కానీ ఈ విధానంలో పనిచేసే వారి సంఖ్య మాత్రం ఇప్పుడిప్పుడే అధికమవుతోంది. ఒకప్పుడు సినిమాల్లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అనే ఒక క్యారెక్టర్ చూసి అది కూడా ఒక జాబ్ టైటిల్ అనుకున్న వారూ లేకపోలేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఫ్రీలాన్స్ విధానం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ... మన వరకు ఇది వచ్చేందుకు కాస్త సమయం పట్టింది.

ఫ్రీలాన్స్ విధానంలో పనిచేసే వారికి ఒక కంపెనీ నుంచి నెల జీతం అంటూ ఏమీ ఉండదు. మన సేవలు ఎవరికి అవసరం ఉంటే వారికి అందించాలి. అది ఒక రోజు కావొచ్చు. నెల రోజులు కావొచ్చు... లేదా ఇంకొంత కాలం కావొచ్చు. మధ్యలో మనకు నచ్చకపోయినా... వెంటనే సదరు కంపెనీకి చెప్పి పని మానెయ్యొచ్చు. మన పని మనకు నచ్చినట్లు చేయటమే ఫ్రీలాన్స్ విధానం.

మన నైపుణ్యంతో అవసరం ఉన్నవారు మనల్ని సంప్రదిస్తారు. ఇద్దరికీ అంగీకారం ఐతే పని మొదలు పెట్టవచ్చు. అయితే ఈ విధానానికి దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అనంతరం డిమాండ్ అధికంగా పెరిగిందని తెలుస్తోంది. ఇందులో ఉన్న ఫ్లెక్సిబిలిటీయే అందుకు కారణం అని నిపుణులు చెబుతున్నారు.

డిజైనర్లు, కంటెంట్ రైటర్ల కు డిమాండ్...

డిజైనర్లు, కంటెంట్ రైటర్ల కు డిమాండ్...

ఒక కంపెనీ ఒక ఉద్యోగిని నియమించుకుంటే... పని ఉన్నా లేకున్నా వారికి జీతం ఇవ్వాల్సి ఉంటుంది. పైగా నియామక లేఖలో నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, భత్యాలు చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి భద్రత, ఆరోగ్య బీమా, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి తప్పనిసరి నిబంధనలు ఉండనే ఉంటాయి. కానీ, ఫ్రీలాన్స్ విధానంలో ఇవేమీ ఉండవు.

కేవలం ఒక పనికి ఇంత (కాంట్రాక్టు) అని మాట్లాడుకుని, ఆ పనిని పూర్తిచేయటం అంతే. మిగితా నిబంధనలు ఏమీ ఫ్రీలాన్స్ లకు వర్తించవు. చాలా కంపెనీలకు కొన్ని రకాల పనులు ఎప్పుడూ ఉండవు. సీజనల్ గా ఉంటాయి. వాటికోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకోవడం వల్ల అధిక ఖర్చు అవుతుంది. అందుకే వారు ఫ్రీలాన్స్ వర్కర్ల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ విధానంలో ప్రస్తుతం గ్రాఫిక్ డిజైనర్లు, కంటెంట్ రైటర్ల కు డిమాండ్ అధికంగా ఉంటోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

64% మంది చెబుతున్నది ఇదే...

64% మంది చెబుతున్నది ఇదే...

బెంగళూరు కు చెందిన రెఫ్రెన్స్ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో 14,000 మంది ఫ్రీలాన్సర్స్ పాల్గొన్నారు. వారిలో 64% మంది తమకు లాక్ డౌన్ తర్వాత పని పెరిగిందని వెల్లడించారు. దీనిపై ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. అందులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మార్చి, ఏప్రిల్ నెలలతో పోల్చితే మే నెలలో 63% ఇన్వాయిస్ లు పెరిగాయని తెలిపారు.

ఫ్రీలాన్స్ వర్కులు అధికంగా పెరిగిన వారిలో కంటెంట్ రైటర్ల కు 80% డిమాండ్ పెరిగి తొలిస్థానంలో నిలిచింది. 76% అధిక డిమాండ్ తో గ్రాఫిక్ డిజైనర్లు నిలిచారు. వ్యయాలు తగ్గించుకునేందుకు కంపెనీలు ఫ్రీలాన్స్ వైపు చూస్తున్నాయని ఈ సర్వే లో తేలింది. కరోనా వల్ల అనిశ్చితి పెరిగిపోయింది. కాబట్టి, తాత్కాలిక పనులను ఇలాంటి పద్ధతిలో పూర్తిచేయటమే మేలని కంపెనీలు భావిస్తున్నాయి.

నోటిఫికేషన్ల లో 75% వృద్ధి..

నోటిఫికేషన్ల లో 75% వృద్ధి..

ఫ్రీలాన్సర్ల కు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ల లో కూడా 75% వృద్ధి కనిపిస్తోందని ఫ్లెక్సింగ్ ఇట్ అనే జిగ్ పోర్టల్ తెలిపినట్లు ఈటీ తన కథనంలో వెల్లడించింది. మరోవైపు ప్రముఖ హెచ్ ఆర్ టెక్నాలజీ కంపెనీ పీపుల్ స్ట్రాంగ్ కూడా ఫ్రీలాన్స్ ఉద్యోగాలు 20-25% పెరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యంగా ఇంటర్నెట్ వ్యాపారాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అనుబంధ సేవలు, స్టార్టుప్ కంపెనీలు, ఆతిథ్య సేవలు, క్విక్ సెర్వెడ్ రెస్టారెంట్లు, రిటైల్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఇది కనిపిస్తోందని చెప్పింది.

త్వరలోనే ఈ రంగాల్లోని ప్రధాన వర్క్ కూడా ఫ్రీలాన్స్ వైపు కన్వెర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో కరోనా తర్వాత ఫ్రీలాీన్స్ జాబ్స్ కు డిమాండ్ పెరుగుతోందని స్పష్టమవుతోంది. సో, ఇంకెందుకు ఆలస్యం... మీకు కూడా ఏదైనా ప్రత్యేక స్కిల్ ఉంటే వెంటనే ఒక ఫ్రీలాన్స్ జాబ్ కొట్టేయండి మరి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+