Agreement with EFTA: ఏళ్ల తరబడి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ తో జరుగుతున్న చర్చలు చివరకు సఫలమయ్యాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి నాలుగు దేశాలు అంగీకరించాయి. దీంతో రానున్న 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్‌మెంట్స్ జరుగుతాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఈ మేరకు వాణిజ్య శాఖ మంత్రి పీష్ గోయల్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.
2008 నుంచి ఈ ఒప్పందాలకు సంబంధించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 13 రౌండ్ల పాటు అధికారులు వివిధ దఫాలుగా దీని గురించి మాట్లాడుకున్నారు. ఒకానొక సమయంలో నవంబర్ 2013లో వీటిని పూర్తిగా నిలిపివేశారు. అనంతరం పదేళ్ల విరామం తర్వాత తిరిగి ప్రారంభించారు. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఈసారి వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రకటన వెలువడింది.

యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ లో భాగంగా ఐస్‌లాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్, నార్వే మరియు స్విట్జర్లాండ్‌తో చర్చలు జరిపినట్లు కేంద్ర మంత్రి గోయల్ ప్రకటించారు. ముఖ్యంగా ఫార్మా, వైద్య పరికరాలు, ఆహార రంగాలకు ఈ ఒప్పందంలో పెద్దపీట వేసినట్లు చెప్పారు. భారతీయ ఎగుమతిదారులకు పెద్ద మార్కెట్ యాక్సెస్ లభించినట్లు వెల్లడించారు. వ్యవసాయేతర, ప్రాసెస్ చేయబడిన వ్యవసాయ ఉత్పత్తుపై సుంకాల్లో 100 శాతం రాయితీ లభిస్తుందన్నారు.
డిజిటల్ ట్రేడింగ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి విభిన్న రంగాలలో EFTA మార్కెట్ లీడర్షిప్ అనుభవం మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఆయా దేశాలతో సహకారాన్ని మరింత పెంచుకునేందుకు ఈ ఒప్పందం తలుపులు తెరిచినట్లేనన్నారు. అయితే EFTA అనేది నాలుగు దేశాలచే క్రియేట్ చేయబడిన అంతర్ ప్రభుత్వ వ్యవస్థ అని గమనించాలి. ఇవి యూరోపియన్ యూనియన్ లో భాగం కాదు. ఇదే తరహా స్వేచ్ఛా వాణిజ్యం కోసం UKతో పాటు యూరోపియన్ యూనియన్‌తోనూ భారత్ విడిగా చర్చలు జరుపుతోంది.


Click it and Unblock the Notifications