ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఏమి లాభం మోసాలు భారీ స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకుల్లో మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి.ఈ మోసాలు వేల కోట్ల రూపాయల్లో ఉంటున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిన నివేదికలో మోసాల మొత్తాన్ని చూస్తే కళ్ళు తిరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నివేదిక ప్రకారం 2018-19 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకుల్లో మోసాలు 71,543 కోట్ల రూపాయలకు చేరాయి. అంతకు క్రితం ఆర్ధిక సంవత్సరం (41,167 కోట్ల రూపాయలు)తో పోల్చితే మోసాల్లో 74 శాతం వృద్ధి ఉండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
బ్యాంకులు విల్లడించిన మోసం కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో మోసం కేసుల సంఖ్య 6,801కి పెరిగింది. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో ఈ కేసులు 5,916గా ఉన్నాయి. ఈ మోసాలకు సంబందించిన కేసుల్లోనే కాకుండా మోసం మొత్తంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాయే అధికంగా ఉంది. కేసుల్లో 55.4 శాతం, మోసానికి సంభందించిన సొమ్ములో 90.2 శాతం ఈ బ్యాంకులదే కావడం గమనార్హం.

ప్రభుత్వ ఆదేశంతో
* బ్యాంకుల్లో భారీ స్థాయిలో మోసాలు జరుగుతున్న వాటిని సకాలంలో గుర్తించడంలో ఆయా బ్యాంకుల యాజమాన్యాలు విఫలం అవుతున్నాయి. అందుకే వేల కోట్ల రూపాయల కుంభ కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇవి బయటపడిన తర్వాత బ్యాంకులు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నా వాటివల్ల ప్రయోజనం తక్కువగా ఉంటుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందుగానే మోసాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఈ మేరకు గత ఫిబ్రవరిలో ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బ్యాంకులు మోసాలను ముందుగానే గుర్తించి వాటిని వెల్లడించడంతో పాటు మోసాల దర్యాప్తు చేయాలనీ ఆదేశించింది. 50 కోట్ల రూపాయలు దాటినా ఖాతాల విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని, మోసపూరిత లావాదేవీలను ముందుగానే గుర్తించాలని ఆదేశించింది. ఈ మేరకు బ్యాంకులు తగిన కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంకు మోసాలు వెలుగుచూస్తున్నాయి.

ప్రయివేట్, విదేశీ బ్యాంకులు..
* ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే కాకుండా ప్రైవేట్, విదేశీ బ్యాంకుల్లోను మోసాలు జరుగుతున్నాయి. 2018-19 సంవత్సరంలో వెల్లడైన మోసాల్లో ప్రయివేట్, విదేశీ బ్యాంకుల వాటా వరుసగా 30.7 శాతం, 11.2 శాతంగా ఉంది. మోసానికి సంబందించిన మొత్తం సొమ్ములో ఈ బ్యాంకుల వాటా వరుసగా 7.7 శాతం, 1.3 శాతంగా ఉంది.
* భారీ మోసాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా ఏకంగా 91.6 శాతం ఉంది. బ్యాంక్ అడ్వాన్స్ కేటగిరీలో 3,606 కేసుల మొత్తం 64,548 కోట్లుగా ఉంది.
* విదేశీ ఎక్స్చేంజీ లావాదేవీల మోసాలకు సంభందించి బ్యాంకులు 13 కేసులను వెల్లడించాయి. వీటి విలువ 695 కోట్ల రూపాయలు.
* కార్డు, ఇంటర్నెట్ లావాదేవీల సంబందించిన 1,866 మోసం కేసుల విలువ 71 కోట్ల రూపాయలుగా ఉంది.

మోసాల నిరోధాలకు చర్యలు
* బ్యాంకుల్లో మోసాలను తగ్గించడానికి ఆయా బ్యాంకులు తగిన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాయి. మోసాలను వీలైనంత త్వరగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నాయి. అనేక మంది వేల కోట్ల రూపాయలు బ్యాంకులను మోసం చేస్తున్నందు వల్ల ఆ ప్రభావం బ్యాంకు కస్టమర్లపై పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకుంటున్నారు.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications