PNB Bank Fraud: పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాస్తవానికి ఒక ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. గతంలో నీరవ్ మోడీ అనే వ్యాపారవేత్తకి సంబంధించిన స్కామ్ 2018 ఆగస్టులో బయటపడింది. ఆ సమయంలో బ్యాంకుకు నకిలీ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ బ్యాంకుకు సమర్పించినట్లు తేలింది. దీని వల్ల బ్యాంకుకు దాదాపు రూ.13,760 కోట్ల నష్టం వాటిల్లిన్న సంగతి తెలసిందే. అయితే ప్రస్తుతం ఆయన భారతదేశం నుంచి వెళ్లిపోయి లండన్ లో నివసిస్తున్నారు.
దీని తర్వాత ప్రస్తుతం మరోసారి పంజాబ్ నేషనల్ బ్యాంకు పేరు మరోసారి వార్తా పత్రికల్లో ప్రధానంగా వినిపిస్తోంది. దీనికి కారణం ఒడిశాకు చెందిన గుప్తా పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.270.57 కోట్ల మేర మోసం చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ పీఎన్బీ నివేదించింది. కంపెనీకి చెందిన ఎన్పీఏ ఖాతాలో ఈ మోసం జరిగినట్లు బ్యాంక్ గుర్తించింది. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లోని బ్యాంకు స్టేషన్ స్క్వేర్ బ్రాంచ్ కంపెనీకి ఈ భారీ రుణాన్ని అందించిందని తెలిపింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం మూడవ త్రైమాసికంలో రెండింతలు పెరిగి రూ.4,508 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. దీనికి ముందు గడచిన ఏడాది బ్యాంక్ ఇదే త్రైమాసికంలో దాదాపు రూ.2223 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అలాగే డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.29,962 కోట్లుగా ఉండగా.. వడ్డీ ఆదాయం రూ.31,340 కోట్లుగా నమోదైంది. అలాగే నిరర్థక ఆస్తుల సంఖ్య కూడా తగ్గుదలను నమోదు చేసింది.
నాలుగు రోజుల కిందట..
ఇదిలా ఉండగా చాలా కాలంగా కొనసాగుతున్న గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ యజమాని మెహుల్ చోక్సీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ కుంభకోణంలో చోక్సీ ప్రధాన నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే మనీలాండరింగ్ చట్టం కింద ముంబై సూరత్ లోని అనేక ప్రాపర్టీలను వేలం ద్వారా విక్రయించటానికి కోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ క్రమంలో ముంబైలోని శాంతాక్రూజ్‌లోని ఖేనీ టవర్‌లో 7 ఫ్లాట్‌లు, ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని భారత్ డైమండ్ బోర్స్‌లో 1 వాణిజ్య యూనిట్, సూరత్‌లోని డైమండ్ పార్క్‌లో 15 ఆఫీస్ స్పేస్‌లు, సూరత్‌లోని డైమండ్ పార్క్‌లో 1 రిటైల్ స్థలం ఇందులో ఉన్నాయి. అయితే ఎక్కువ ఆలస్యం చేయటం వల్ల సదరు ఆస్తులు మెయింటెనెన్స్ లో లేనందున వాటి ధర తగ్గే అవకాశం ఉందనే వాదనలో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు తాజా రూలింగ్ ప్రకటించింది. దీంతో ఆస్తుల విక్రయం ద్వారా బ్యాంకుకు జరిగిన నష్టాన్ని రికవర్ చేసే ప్రక్రియ కొంత వేగవంతం అయ్యింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications