Bank frauds: భారతీయ బ్యాంకుల్లో భారీగా పెరిగిన మోసాలు.. అందులోనూ గుడ్ న్యూస్ ఏంటంటే..
Bank frauds: FY23లో భారతీయ బ్యాంకులు మొత్తం 13 వేల 530 మోసాలను నివేదించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక వెల్లడించింది. FY22లో నమోదైన 9,097 కంటే ఇవి చాలా ఎక్కువ అని స్పష్టం చేసింది. అయితే విలువ పరంగా చూస్తే మాత్రం గత ఏడాదిలో పాల్పడిన మోసాల మొత్తం 59 వేల 819 కోట్ల నుంచి 30 వేల 252 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది.
"గత మూడేళ్లలో బ్యాంకుల్లో జరిగిన మోసం కేసుల అంచనా ప్రకారం.. ప్రైవేట్ రంగ బ్యాంకులు గరిష్ఠ సంఖ్యలో మోసాలను నివేదించాయి" అని నివేదిక తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు FY23లో మొత్తం 3 వేల 405 మోసాలను నమోదు చేశాయి. వీటి విలువ మొత్తం 21 వేల 125 కోట్లుగా అంచనా వేశారు. అయితే ఇది FY22లో నమోదైన 40 వేల 15 కోట్ల కంటే తక్కువ. ప్రైవేట్ బ్యాంకులు FY23లో 8 వేల 727 కోట్ల విలువైన 8 వేల 932 మోసాలను నివేదించాయి. FY22లో జరిగన 17 వేల 387 కోట్ల విలువైన మోసాలు దాదాపుగా సగానికి తగ్గాయన్నమాట.

కార్డ్స్ లేదా ఇంటర్నెట్ ఆధారిత చెల్లింపులతో కూడిన డిజిటల్ పేమెంట్స్ విభాగంలో ప్రధానంగా మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది. ఈ మోసాలకు సంబంధిన విలువ ప్రధానంగా అడ్వాన్స్‌ల కేటగిరీలో నివేదించబడ్డాయి. FY21తో పోలిస్తే FY22లో నమోదైన మోసాల విలువలో 55 శాతం క్షీణత ఉంది. అదే విధంగా FY22 కంటే FY23లో మోసాల విలున 49 శాతం తగ్గింది.
ప్రైవేట్ రంగ బ్యాంకులు నివేదించిన మోసాలు ఎక్కువగా చిన్న వాల్యూ కార్డ్స్ మరియు ఇంటర్నెట్ సంబంధించినవి. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మాత్రం ప్రధానంగా రుణ పోర్ట్‌ఫోలియోలో విభాగంలో ఉన్నాయని RBI వెల్లడించింది. బ్యాంకులు సమర్పించే ఫ్రాడ్ మానిటరింగ్ రిటర్న్‌లలో (FMR) డేటా విశ్వసనీయతను మెరుగుపరచడానికి, రుణదాతలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర బ్యాంకు సూచింంచింది.


Click it and Unblock the Notifications