UPI News: ఫ్రాన్స్ చేరుకున్న భారత యూపీఐ సేవలు.. భారతీయులకు వేడుకే..
UPI In France: భారతదేశానికి చెందిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థను వినియోగించేందుకు ఫ్రాన్స్ అనుమతించింది. NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, ఇ-కామర్స్, సామీప్య చెల్లింపులను సురక్షితం చేయడంలో ఫ్రెంచ్ లీడర్ లైరా భారతీయ యూపీఐ చెల్లింపు యంత్రాంగాన్ని ఆమోదించారు.
దీంతో ఇక నుంచి భారతీయ పర్యాటకులు ఫ్రాన్స్ వ్యాప్తంగా యూపీఐ వినియోగించి చెల్లింపులను పూర్తి చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేయడం ద్వారా ఈఫిల్ టవర్‌ను సందర్శించడానికి తమ సందర్శనను బుక్ చేసుకోవచ్చు. దీంతో యూపీఐని ఆమోదించిన తొలి యూరోపియన్ దేశంగా ఫ్రాన్స్ అవతరించింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటన వెలువడింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఐకానిక్ ఈఫిల్ టవర్ నుంచి యూపీఐ చెల్లింపు విధానం ప్రారంభమవుతుందని లైరా ప్రకటించారు. 10 దేశాలకు చెందిన నాన్ రెసిడెంట్ భారతీయులు తమ దేశీయ బ్యాంకు ఖాతాలు విదేశాల్లో ఉన్న వారి ఫోన్ నంబర్‌లకు లింక్ చేయబడితే డబ్బు పంపడానికి, స్వీకరించడానికి యుపీఐ చెల్లింపు వ్యవస్థను ఉపయోగించవచ్చని గత సంవత్సరం భారత ప్రభుత్వం తెలిపింది. ఈ దేశీల జాబితాలో సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, యూఎస్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ ఉన్నాయి.
గత ఏడాది ఫిబ్రవరిలో నగదు తక్షణ బదిలీలను ప్రారంభించడానికి భారత్-సింగపూర్ తమ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ PayNowలను అనుసంధానించారు. సింగపూర్‌లో యూపీఐ చెల్లింపులు పని చేయడానికి మార్గంలో PayNow ఉంటుంది. రానున్న కాలంలో యూపీఐ ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని సంచలనాలను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత ప్రభుత్వం చెబుతోంది. అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రజలకు చెల్లింపుల్లో సౌలభ్యాన్ని కలిగిస్తుందని చెబుతోంది.


Click it and Unblock the Notifications