PM Modi in Paris: డిజిటల్ పేమెంట్స్ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. యూరోపియన్ దేశంలో యూపీఐ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ప్రధాని మోదీ ప్యారిస్ పర్యటన నేపథ్యంలో ఒప్పందం ఖరారైంది.
యూపీఐ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులో ఉంచేందుకు భారత్-ఫ్రాన్స్ అంగీకరించాయి. ఈఫిల్ టవర్ పై నుంచి భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారతీయ పర్యాటకులు త్వరలో UPI ఉపయోగించి రూపాయి చెల్లింపులు చేయగలుగుతారని పేర్కొన్నారు. దీనికోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI).. ఫ్రాన్స్ సురక్షిత ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థ లైరాతో 2022లో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.

ఫ్రాన్స్‌తో ఒప్పందానికి ముందు భారత్ 2023లో సింగపూర్‌కు చెందిన PayNowతో ఒప్పందంపై సంతకం చేసింది. ఇరు దేశాల్లోని వినియోగదారులను సరిహద్దు లావాదేవీలు చేయడానికి వెసులుబాటు ఏర్పడింది. ఇదే క్రమంలో UAE, భూటాన్, నేపాల్ ఇప్పటికే UPI వ్యవస్థను అంగీకరించాయి. తాజాగా.. NPCI యూరప్, పశ్చిమాసియా, USలోని అనేక ఇతర దేశాల్లో UPI సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఫ్రాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివే విద్యార్థులకు దీర్ఘకాలిక ఐదేళ్ల వీసాలు మంజూరు చేయాలని ఫ్రాన్స్ నిర్ణయించినట్లు ప్రధాని మోదీ ధృవీకరించారు. దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అత్యంత అనువైన సమయమని, ముందుగా పెట్టుబడులు పెట్టే వారు లాభాలను పొందుతారని అన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications