Vedanta: అనిల్ అగర్వాల్‌కు భారీ షాక్.. రూ.1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్ రద్దు.. ఏమైందంటే..
Foxconn: బిలియనీర్, మైనింగ్ కింగ్ అనిల్ అగర్వాల్‌కి అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఒక్కసారిగా లక్షల కోట్లు విలువైన డీల్ ప్రారంభానికి ముందే మునిగిపోయింది.
వేగంగా మారుతున్న టెక్ ప్రపంచంలో తన ప్రస్థానాన్ని మరింతగా పెంచాలని భారత్ ఆకాంక్షిస్తోంది. ఈ క్రమంలో చిప్ తయారీ రంగంలోకి అడుగుపెట్టాలని భావించింది. దీనికోసం ప్రోత్సాహకాలను ప్రారంభించటంతో వాటిని అందిపుచ్చుకోవాలని వేదాంత గ్రూప్ ప్రయత్నించింది. తైవాన్ ప్రఖ్యాత చిప్ తయారీదారు ఫాక్స్‌కాన్‌తో జాయింట్ వెంచర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

తాజాగా జాయింట్ వెంచర్ ఉపసంహరించుకోవడంతో భారతీయ బిలియనీర్ అనిల్ అగర్వాల్ సోమవారం పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొన్నారు. ప్రధాన సెమీకండక్టర్ చిప్ డీల్‌లో భారత్‌లో కొత్త ఆవిర్భావానికి దారితీసింది. మరింత వైవిధ్యమైన అభివృద్ధి అవకాశాలను అన్వేషించడానికి, పరస్పర ఒప్పందం ప్రకారం వేదాంతతో జాయింట్ వెంచర్‌లో ముందుకు సాగలేకపోతున్నట్లు ఫాక్స్‌కాన్ అధికారికంగా ప్రకటించింది.
భారతదేశంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌కు కట్టుబడి ఉన్నట్లు అనిల్ అగర్వాల్ వేదాంత ధృవీకరించింది. అయితే ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లటానికి ఇతర సాంకేతిక భాగస్వాములను తీసుకురానున్నట్లు తెలిపింది. ఇదిలావుండగా వేదాంతతో జాయింట్ వెంచర్ నుంచి వైదొలగాలని ఫాక్స్‌కాన్ తీసుకున్న నిర్ణయం భారతదేశ సెమీకండక్టర్ ఫాబ్రికేషన్ లక్ష్యాలపై ఎటువంటి ప్రభావం చూపబోదని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్‌లో తెలిపారు.


Click it and Unblock the Notifications