ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ (Foxconn) భారతదేశంలో తన వ్యాపార విస్తరణలో మరో కీలక అడుగు వేసింది. తైవాన్‌కు చెందిన ఈ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం తమిళనాడులో రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 14 వేల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని తమిళనాడు పరిశ్రమల మంత్రి టిఆర్‌బి రాజా వెల్లడించారు. మంత్రి ఎక్స్ (మాజీ ట్విట్టర్) లో పోస్టు చేస్తూ.. ఫాక్స్‌కాన్ రూ.15 వేల కోట్ల పెట్టుబడితో తమిళనాడులో భారీ ప్రాజెక్ట్ ప్రారంభించబోతోంది. ఇది రాష్ట్రంలో 14 వేల అధిక విలువ గల ఉద్యోగాలను సృష్టించనుంది. ఇంజనీర్లు సిద్ధంగా ఉండండని పేర్కొన్నారు.
తమిళనాడు పెట్టుబడి ప్రోత్సాహక సంస్థ Guidance Tamil Nadu.. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక Foxconn Desk ను ఏర్పాటు చేసింది. ఈ డెస్క్ ద్వారా ప్రాజెక్ట్‌ల అమలు వేగవంతం చేయడం, అనుమతులు సులభతరం చేయడం, ప్రభుత్వంతో సమన్వయం మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. రాజా మాట్లాడుతూ.. ఫాక్స్‌కాన్ ఇప్పుడు తన విలువ ఆధారిత తయారీ,R&D (పరిశోధన, అభివృద్ధి) కార్యకలాపాలు, AI ఆధారిత అధునాతన సాంకేతికత యొక్క తదుపరి దశను తమిళనాడుకు తీసుకువస్తుంది. ఇది రాష్ట్ర పరిశ్రమల రంగానికి గేమ్‌చేంజర్ అవుతుందని తెలిపారు.

ఫాక్స్‌కాన్ భారత ప్రతినిధి రాబర్ట్ వు (Robert Wu) ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ను కలిశారు. ఈ సమావేశంలో కొత్త పెట్టుబడులపై, తమిళనాడులో ఉన్న ఫ్యాక్టరీల విస్తరణపై చర్చలు జరిగాయి. ఫాక్స్‌కాన్ ప్రతినిధులు ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా కలిశారు. బెంగళూరులో జరిగిన ఆ సమావేశంలో, కంపెనీ కర్ణాటకలో కూడా తన ఉనికిని బలోపేతం చేయడం, కొత్త సాంకేతిక అవకాశాలను అన్వేషించడం గురించి చర్చించింది. ఫాక్స్‌కాన్ ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఫాక్స్‌కాన్ ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ. ఇది ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టెలివిజన్లు, గేమింగ్ కన్సోళ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేస్తుంది. ప్రముఖ ఆపిల్ (Apple) కంపెనీకి చెందిన iPhone, iPad, MacBook ఉత్పత్తులను తయారు చేసే ప్రధాన భాగస్వామిగా ఫాక్స్‌కాన్ ఉంది. అదనంగా సోనీ, మైక్రోసాఫ్ట్, HPవంటి ప్రపంచ దిగ్గజ బ్రాండ్లు కూడా దీని కస్టమర్లుగా ఉన్నాయి.
ఈ పెట్టుబడి భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత బలం చేకూర్చనుంది. ఫాక్స్‌కాన్ పెట్టుబడి ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారతదేశం ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదగబోతోందని నిపుణులు చెబుతున్నారు. తమిళనాడు పరిశ్రమ మంత్రి రాజా మాట్లాడుతూ మేము ద్రవిడ మోడల్ 2.0 వైపు అడుగులు వేస్తున్నాము. ఫాక్స్‌కాన్ లాంటి సంస్థల పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తర్వాత తమిళనాడు దక్షిణాసియాలోని ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications