7 నెలల గరిష్టానికి.. భారీ లాభాల్లో మార్కెట్: దుమ్మురేపిన బ్యాంకింగ్

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (అక్టోబర్ 6) భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఎనర్జీ మినహా మిగతా రంగాలు భారీ లాభాలు నమోదు చేశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 పాయింట్ల మేర సూచించింది. సెన్సెక్స్ 600.87 పాయింట్లు(1.54%) లాభపడి 39,574.57 వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు(1.38%) ఎగిసి 11,662.40 వద్ద ముగిసింది. 1,488 షేర్లు లాభాల్లో, 1,165 షేర్లు నష్టాల్లో ముగియగా, 159 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్ ధర నాలుగు శాతానికి పైగా లాభపడింది. నిన్నటి వరకు ఎగిసిపడిన ఐటీ స్టాక్స్ ఈ రోజు నీరసించాయి.

నిఫ్టీ 7 నెలల గరిష్టం, 39,600ను తాకిన సెన్సెక్స్

నిఫ్టీ 7 నెలల గరిష్టం, 39,600ను తాకిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు ఉదయం మంచి లాభాల్లో ప్రారంభమయ్యాయి. ముగింపు వరకు అదే దూకుడు కొనసాగించాయి. ఆరంభ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్ 360పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ 92 పాయింట్లతో దూకుడుగా ప్రారంభించింది. ఓ దశలో సెన్సెక్స్ 39,623 పాయింట్లను తాకింది. చివరకు ఆరువందల పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ ఏడు నెలల గరిష్టాన్ని తాకింది.

ఇక, డాలర్ మారకంతో రూపాయి 17 పైసలు క్షీణించి 73.46 వద్ద ముగిసింది. ప్రారంభంలో డాలర్ మారకంతో రూపాయి 13 పైసలు బలపడి 73.16 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిన్నటి సెషన్‌లో 73.29 వద్ద ముగిసింది. చివరకు 17 పైసల నష్టంతో ముగిసింది.

దుమ్మురేపిన బ్యాంకింగ్

దుమ్మురేపిన బ్యాంకింగ్

- మార్కెట్లు వరుసగా నాలుగో రోజు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి.

- నిఫ్టీ బ్యాంకు 483 పాయింట్లు ఎగిసి 22,854, మిడ్ క్యాప్ 108 పాయింట్లు లాభపడి 17,216కు చేరుకుంది.

- బ్యాంకులు భారీ లాభాల్లో ముగియడంతో నిఫ్టీ బ్యాంకు 2 శాతానికి పైగా ఎగిసింది.

- HDFC బ్యాంకు, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్ర బ్యాంకు భారీ లాభాల్లో ముగిశాయి.

- సెప్టెంబర్ త్రైమాసికంలో మంచి ఫలితాలు సాధిస్తుందనే వార్తల నేపథ్యంలో HDFC జంట (HDFC బ్యాంకు, HDFC) మంచి లాభాలు చూసింది.

- ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ తక్కువ లాభాల్లో ముగిసింది. రేపు టీసీఎస్ ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్స్ ఒత్తిడికి గురయ్యాయి.

- బ్రిటానియా 2 శాతం నష్టపోయింది.

- టాటా మోటార్స్... నిఫ్టీ టాప్ గెయినర్‌గా నిలిచింది. టాటా స్టాక్స్ 8 శాతం మేర లాభపడ్డాయి.

- అదానీ పోర్ట్స్ 3 శాతం లాభపడింది.

- సెప్టెంబర్ మాసంలో సేల్స్ పెరిగిన నేపథ్యంలో ఆటో స్టాక్స్ ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి.

- ప్రజ్ ఇండస్ట్రీస్ 3 శాతం లాభపడింది.

టాప్ లూజర్స్, గెయినర్స్

టాప్ లూజర్స్, గెయినర్స్

- టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి.

- టాప్ లూజర్స్ జాబితాలో బ్రిటానియా, కోల్ ఇండియా, టాటా స్టీల్, హిండాల్కో, విప్రో ఉన్నాయి.

- హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, టాటా మోటార్స్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ మోస్ట్ యాక్టివిటీస్ స్టాక్స్.

- టీసీఎస్ షేర్ ధర 0.45 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.46 శాతం, ఇన్ఫోసిస్ షేర్ ధర 0.74 శాతం, టెక్ మహీంద్ర షేర్ 0.56 శాతం, కోఫోర్జ్ షేర్ 2.81 శాతం పెరగగా, విప్రో షేర్ 1.32 శాతం తగ్గింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+