నాలుగు న్యూ ఫండ్ ఆఫర్‌లు (NFO)లు ప్రస్తుతం మార్కెట్లో సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అయ్యాయి. అందులో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, థీమాటిక్ ఫండ్, ఇటిఎఫ్, ఇండెక్స్ ఫండ్ లు ఉన్నాయి. చాలా మంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తమ అభిమాన ఫండ్ హౌస్ల నుంచి కొత్త ఫండ్ ఆఫర్ లేదా కొత్త స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని భావిస్తారు. ఎన్ఎఫ్ఓలో యూనిట్లను రూ. 10కే అందిస్తారు.

మీరు NFOలో పెట్టుబడి పెట్టాలా? సుదీర్ఘ పనితీరు రికార్డుతో మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టడం ఎల్లప్పుడూ మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మీ పెట్టుబడి నిర్ణయాన్ని తీసుకోవాలంటే మీ వద్ద కొంత చారిత్రక డేటా ఉండాలి. కొత్త ఆఫర్‌ల విషయానికి వస్తే మీ వద్ద డేటా ఏదీ ఉండదు. చాలా మంది మ్యూచువల్ ఫండ్ నిపుణులు కొత్త స్కీమ్‌లో మార్కెట్‌లో అందుబాటులో లేని ప్రత్యేకమైన లేదా కొత్తదాన్ని ఆఫర్ చేస్తే మీరు అందులో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చని చెబుతున్నారు.

న్యూ ఫండ్ ఆఫర్ లో ఉన్న ఫండ్లలో బరోడా బీఎన్పీ పారిబస్ ఫిక్స్ డ్ మెచ్యూరిటీ ప్లాన్ ఉంది. ఇది జూన్ 19 ప్రారంభమై.. 21న ముగిసింది. 360 వన్ ఫ్లెక్సి ఫండ్ జూన్ 12న ప్రారంభమై జూన్ 26న ముగుస్తుంది. మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ జూన్ 15న ప్రారంభమై జూన్ 29న ముగియనుంది. సామ్కో యూక్టివ్ మూమెంటమ్ ఫండ్ జూన్ 15న ప్రారంభమై.. జూన్ 29న ముగుస్తుంది. డీఎస్పీ నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్ జూన్ 21 ప్రారంభమైంది. జులై 3న ముగియనుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications