పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకూ భయానక రూపం దాలుస్తోంది. బుధవారం మార్చి 11న, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Dubai Airport) సమీపంలో రెండు అనుమానిత ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి. ఈ ఘటనలో ఒక భారతీయుడితో సహా మొత్తం నలుగురు వ్యక్తులు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇరాన్ కేవలం అమెరికాపైనే కాకుండా అమెరికా మిత్ర దేశాలపై కూడా విరుచుకుపడుతోంది. దుబాయ్ ఎయిర్ పోర్ట్ ను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు చేస్తోంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు ప్రారంభమైనప్పటి నుండి దుబాయ్ విమానాశ్రయంపై దాడి జరగడం ఇది మూడవసారి.

ఎయిర్‌పోర్ట్ వద్ద ఏం జరుగుతోంది?
దుబాయ్ మీడియా కార్యాలయం సమాచారం ప్రకారం.. డ్రోన్ దాడులు జరిగినప్పటికీ విమాన రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితే గతంలో మార్చి 1 , మార్చి 7 తేదీలలో జరిగిన దాడుల సమయంలో ఎమిరేట్స్ వంటి ప్రముఖ విమాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. తాజా దాడుల నేపథ్యంలో యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) క్షిపణి , డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నట్లు ప్రకటించింది. గాలిలో వినిపిస్తున్న శబ్దాలు మన వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు క్షిపణులను అడ్డుకోవడం వల్ల వస్తున్నవేనని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.
ఆయిల్ రిఫైనరీల మూత , ఆర్థిక ప్రభావం
ఈ యుద్ధ ప్రభావం కేవలం విమాన ప్రయాణాలపైనే కాకుండా ఇంధన రంగంపై కూడా గట్టిగా పడుతోంది. అబుదాబిలోని రువైస్ ఇండస్ట్రియల్ సిటీలో డ్రోన్ దాడి వల్ల అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనరీ అయిన రువైస్ రిఫైనరీని ముందు జాగ్రత్త చర్యగా మూసివేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల గ్లోబల్ ఆయిల్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉందని సౌదీ అరామ్కో హెచ్చరించింది. యూఏఈ మాత్రమే కాకుండా బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాల మౌలిక సదుపాయాలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం ఉండటంతో.. యూఏఈ ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పిస్తోంది. దేశంలో కనీసం ఆరు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువుల నిల్వలు (Strategic Stockpile) ఉన్నాయని ఆర్థిక , పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మార్కెట్లలో ధరలు పెరగకుండా నిరంతర నిఘా ఉంచామని, కొరత లేకుండా సరుకులను సరఫరా చేస్తున్నామని తెలిపింది.
ఏదేమైనా దుబాయ్ ప్రస్తుతం పరిస్థితులైతా అంత చక్కగా లేవు. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వారు, ముఖ్యంగా ప్రయాణికులు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యుద్ధం కారణంగా విమాన షెడ్యూల్‌లు ఎప్పుడు మారతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన..నేనే లేకుంటే టెహ్రాన్ చేతిలో ప్రపంచం ముక్కలయ్యేదని వెల్లడి..

దేశంలో ఎల్పీజీ సంక్షోభం.. వచ్చే నాలుగేళ్ల దాకా ఈ కష్టాలు తప్పవు.. హెచ్చరిస్తున్న ఆర్థిక నిపుణులు

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications