Interest Rates: ఖరీదైన రుణాలు.. వడ్డీ రేట్లు పెంచిన నాలుగు బ్యాంకులు.. నవంబర్ 1 నుంచి..
Interest Rates: భారతీయ రిజర్వు బ్యాంక్ నవంబర్ 3న సమావేశం కానున్న తరుణంలో నాలుగు బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచాయి. తాజాగా సవరించిన MCLR రేట్లు ఈనెల ఒకటి నుంచి అమలులోకి వచ్చినట్లు బ్యాంకులు వెల్లడించాయి. దీంతో రుణ గ్రహీతపై వడ్డీల భారం పెరగనుంది.

MCLR అంటే ఏమిటి..?
MCLR అనేది ఆర్థిక సంస్థ కోసం రిఫరెన్స్ రేటు లేదా అంతర్గత బెంచ్‌మార్క్. MCLR పద్ధతిని భారతీయ ఆర్థిక వ్యవస్థలో 2016లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. 2010లో ప్రవేశపెట్టిన బేస్ రేట్ సిస్టమ్ స్థానంలో MCLR విధానం వచ్చింది. ఈ ఏడాది మే నుంచి ఆర్‌బీఐ నాలుగుసార్లు రెపోను 1.90 శాతం పెంచింది. ఏప్రిల్ వరకు 6.60 శాతం రేటుకు లభించిన రుణం ఇప్పుడు కనీసం 8 శాతానికి అందుబాటులో ఉంది.

ICICI Bank
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ MCLR రేటును 0.20 శాతం పెంచింది. ఇంతకు ముందు ఇది 8.10 శాతంగా ఉన్న ఒక సంవత్సరం MCLR ఇప్పుడు 8.30 శాతానికి చేరుకుంది.

Punjab National Bank
Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్ MCLR 0.30 శాతం పెంచింది. దీనితో ఒక సంవత్సరం రేటు ఇప్పుడు 8.05 శాతానికి చేరుకుంటుంది. ఇది గతంలో 7.75 శాతంగా ఉంది. మూడేళ్ల రేటు 8.05 నుంచి 8.35 శాతానికి పెరిగింది.

Bank Of India
Bank Of India: బ్యాంక్ ఆఫ్ ఇండియా MCLRను 0.15 శాతం పెంచింది. ఒక సంవత్సరం MCLR రేటు ఇంతకుముందు 7.80 శాతం నుంచి ప్రస్తుతం 7.95 శాతానికి చేరుకుంది.

Indian Bank
Indian Bank: ఇండియన్ బ్యాంక్ ఒకరోజు MCLR 0.35 శాతం పెంచటంతో అది 7.40 శాతానికి పెంచింది.

రిటైల్ లోన్ బూమ్..
బ్యాంకుల మొత్తం క్రెడిట్‌లో రిటైల్ రుణాల వాటా 29 శాతానికి చేరుకుంది. వీటిలో ఎక్కువ భాగం గృహ, వాహన రుణాలే ఉన్నాయి. ఏడాది క్రితం వీటి వాటా కేవలం 13.2 శాతంగా ఉన్నాయి. సెప్టెంబరులో సేవల రంగానికి క్రెడిట్ 20 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications