High FD Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ.. కొన్ని బ్యాంకింగ్ కంపెనీలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఈ నెలలో పెంచాయి. ఈ అనుకూలమైన సర్దుబాటు సాధారణ కస్టమర్‌లు మరియు సీనియర్ సిటిజన్‌లకు వర్తిస్తుంది. ఈ ఏడాది చివర్లో బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
యాక్సిస్ బ్యాంక్: ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు వడ్డీ రేట్లను పెంచింది. ఈ మార్పు ఆగస్టు 14 నుంచి అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఈ మార్పు 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు కాలానికి చేసే డిపాజిట్లకు వర్తిస్తుంది. వడ్డీ రేట్ల సవరణ తర్వాత బ్యాంక్ తన కస్టమర్లకు 3.5% నుంచి గరిష్ఠంగా 8.05% వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది.

కెనరా బ్యాంక్: ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంక్ ప్రస్తుతం సీనియర్ సిటిజన్ల కోసం తన FD పథకాలపై 4% నుంచి 7.75% వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. తాజాగా సవరించిన రేట్లు ఆగస్టు 12 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఫెడరల్ బ్యాంక్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫెడరల్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపునకు ప్రకటించింది. ఈ మార్పు ఆగస్ట్ 15, 2023 నుంచి అమలులోకి వచ్చింది. ఫెడరల్ బ్యాంక్ ప్రకటన ప్రకారం.. సీనియర్ సిటిజన్‌లకు 13 నెలల కాలానికి 8.07% ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఆగస్టు ప్రారంభంలో సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లలో 0.85% వడ్డీ రేటు పెంపును ప్రకటించింది. 5 ఏళ్ల వ్యవధిలో సీనియర్ సిటిజన్ కస్టమర్‌లు ఇప్పుడు 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల కోసం 4.50% నుంచి గరిష్ఠంగా 9.10% వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అందిస్తోంది.


Click it and Unblock the Notifications