Loan Fraud: దేశంలో బ్యాంకుల పనితీరు బాగానే ఉంది. కానీ అప్పుడప్పుడూ కొంతమంది అధికారులు మోసాలకు పాల్పడిన వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అలా ఇండియన్ బ్యాంక్‌కు చెందిన నలుగురు సీనియర్ అధికారులు రూ.30 కోట్ల మోసానికి పాల్పడిన విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది.

అధికారుల అరెస్ట్..
చెన్నై ఇండియన్ బ్యాంక్‌లో భారీ మోసానికి పాల్పడిన నలుగురు అధికారులకు 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. చెన్నైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నలుగురు బ్యాంకు అధికారులతో పాటు మరో ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా సైతం విధించారు. ఇందులో బ్యాంక్ చీఫ్ మేనేజర్ అజీజ్, సీనియర్ మేనేజర్ జీవీ శ్రీనివాసన్, సీనియర్ మేనేజర్ ముత్తయ్య, జనరల్ మేనేజర్ ఎస్. అరుణాచలం ఉన్నారు.

37 నెలల కఠిన కారాగార శిక్ష..
అదేవిధంగా M/s కిరణ్ ఓవర్సీస్ లిమిటెడ్‌కు చెందిన రంజీవ్ పాత్ర, అతని భార్య కిరణ్ పాత్ర ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానాతో 37 నెలల పాటు కఠిన కారాగార శిక్షను అనుభవించాలి. చెన్నై కిరణ్ ఓవర్సీస్ లిమిటెడ్, ఢిల్లీకి చెందిన M/S కిరణ్ ఓవర్సీస్ లిమిటెడ్‌లకు కోర్టు ఒక్కొక్కటి రూ.10,000 జరిమానా విధించింది.

నకిలీ పత్రాలతో..
నిందితులు రుణం కోసం బ్యాంకుకు తప్పుడు, నకిలీ పత్రాలు సమర్పించారని, బ్యాంకు ఆర్థిక ప్రయోజనాలను కాపాడకుండా కొందరు బ్యాంకు అధికారులు రుణం మొత్తాన్ని విడుదల చేశారని విచారణలో తేలింది. నిందితుడి కారణంగా ఇండియన్ బ్యాంక్ రూ.39.18 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications