Bengaluru: బెంగళూరులో రెండు జీతాలున్నా ఇల్లు కొనలేకపోయా.. వైరల్ అవుతున్న టెక్కీ ఆవేదన!
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలవబడే బెంగళూరు (Bengaluru) లో సొంత ఇల్లు ఉండటం అనేది చాలామందికి ఒక కల. కానీ, ఆ కల నిజం చేసుకోవడం ఎంత కష్టమో రీసెంట్‌గా ఒక టెక్కీ షేర్ చేసిన పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. అమెజాన్ టెక్కీ.. 'JSLovers' ఫౌండర్ నేహా శర్మ, బెంగళూరులో ఇల్లు కొనడానికి పడ్డ కష్టాలను, యూకేలో ఇల్లు కొన్న అనుభవంతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బెంగళూరులో ఎదురైన చేదు అనుభవం
నేహా శర్మ తన భర్తతో కలిసి బెంగళూరులో ఉన్నప్పుడు, ఇద్దరి జీతాలు కలిపినా ఒక ఫ్లాట్ కొనడం తమకు ఆర్థికంగా చాలా భారంగా అనిపించిందని పేర్కొన్నారు. "బెంగళూరులో ఇద్దరి శాలరీలు ఉన్నా ఒక ఫ్లాట్ కొనడానికి నానా తంటాలు పడ్డాం, చివరికి ఆ నిర్ణయాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం" అని ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో పెరుగుతున్న స్థిరాస్తి ధరలు, మధ్యతరగతి వారికి అందనంత ఎత్తుకు వెళ్లాయని ఈ పోస్ట్ సూచిస్తోంది.
యూకేలో సులువైన ప్రయాణం
అయితే, యూకేకు మారిన కేవలం రెండు ఏళ్లలోనే నేహా ఒక స్వతంత్ర 3-బెడ్‌రూమ్ ఇంటిని కొనుగోలు చేశారు. విశేషం ఏమిటంటే, కేవలం ఒక్కరి ఆదాయంతోనే ఆమె ఈ విజయాన్ని సాధించారు. ఆమె కొన్న ఇంట్లో బ్యాక్ యార్డ్, పార్కింగ్ వసతి, మంచి వ్యూస్‌తో పాటు గ్యాస్, ఫ్రిజ్, డిష్ వాషర్ వంటి అన్ని కిచెన్ అప్లయన్సెస్ కూడా ఉన్నాయి. భారత్‌లో అపార్ట్‌మెంట్ కొంటే వచ్చే వసతుల కంటే ఇక్కడ ఎక్కువ సౌకర్యాలు తక్కువ ధరకే లభించాయని ఆమె వివరించారు.
బ్లాక్ మనీ, పారదర్శకత
భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ప్రధాన లోపాన్ని నేహా శర్మ ఎత్తిచూపారు. యూకేలో ఇల్లు కొనేటప్పుడు ఎక్కడా పారదర్శకత లోపించలేదని, ఎవరూ కూడా తనను 'బ్లాక్ మనీ' (నల్లధనం) అడగలేదని ఆమె చెప్పారు. భారత్‌లో రియల్ ఎస్టేట్ డీల్స్ అంటేనే కొంత నగదు రూపంలో (అన్‌అకౌంటెడ్ క్యాష్) ఇవ్వాలనే డిమాండ్లు ఉంటాయని, ఇది సామాన్యులకు పెద్ద తలనొప్పిగా మారిందని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, యూకేలో మొదటిసారి ఇల్లు కొనేవారికి ఇచ్చే డిస్కౌంట్ కూడా తనకు బాగా ఉపయోగపడిందని ఆమె తెలిపారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. చాలా మంది నెటిజన్లు భారత్‌లో ప్రాపర్టీ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని, ఇది రియల్ ఎస్టేట్ బబుల్‌కు దారితీస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. పారదర్శకత లేకపోవడం, దాచిన ఖర్చులు (Hidden Costs) ఇక్కడ ఇల్లు కొనాలనుకునే వారిని భయపెడుతున్నాయి. మొత్తానికి, బెంగళూరు (Bengaluru) లో ఐటీ జీతాలు భారీగా ఉన్నప్పటికీ, సామాన్య ఉద్యోగికి సొంత ఇల్లు అనేది ఇంకా ఒక అందని ద్రాక్షలానే మిగిలిపోతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.


Click it and Unblock the Notifications