For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫార్చ్యూన్ గ్లోబెల్ జాబితా: ప్రపంచంలోని టాప్ 100 కంపెనీల్లో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్

|

2020 ఫార్చ్యూన్ గ్లోబెల్ 500 జాబితాలో బిలియనీర్ ముఖేష్ అంబానీ యొక్క ఆయిల్ నుండి టెలికాం వరకు అన్నిటి సమ్మేళనంగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ 96వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో ప్రపంచంలోని టాప్ 100 కంపెనీల్లోకి ప్రవేశించడానికి 10 స్థానాలు ఎగబాకింది భారత సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇప్పటివరకు ఏ భారతీయ కంపెనీ ఫార్చ్యూన్ గ్లోబెల్ జాబితాలో ఈ స్థానం వరకు రాలేదు.

ఫార్చ్యూన్ 2020 జాబితా.. 524 బిలియన్ డాలర్ల ఆదాయంతో వాల్‌మార్ట్ ఫస్ట్ ప్లేస్

ఫార్చ్యూన్ 2020 జాబితా.. 524 బిలియన్ డాలర్ల ఆదాయంతో వాల్‌మార్ట్ ఫస్ట్ ప్లేస్

ఫార్చ్యూన్ 2020 జాబితాలో గత ఆర్ధిక సంవత్సరం వివిధ సంస్థల ఆదాయాల ఆధారంగా స్థానం కల్పించారు. 524 బిలియన్ డాలర్ల ఆదాయంతో వాల్‌మార్ట్ అగ్రస్థానంలో నిలిచింది. మూడు చైనా సంస్థలైన సినోపెక్ గ్రూప్ (407 బిలియన్ డాలర్లు), స్టేట్ గ్రిడ్ (384 బిలియన్ డాలర్లు) మరియు చైనా నేషనల్ పెట్రోలియం (379 బిలియన్ డాలర్లతో తరువాత స్థానాల్లో ఉన్నాయి . వాల్‌మార్ట్, సినోపెక్ మరియు చైనా నేషనల్ పెట్రోలియం స్థానాల్లో గత జాబితాలో స్థానంలో మార్పు లేదు.రాయల్ డచ్ షెల్ 5 వ స్థానంలో, సౌదీ చమురు దిగ్గజం అరాంకో 6 వ స్థానంలో ఉన్నాయి.

ఫార్చ్యూన్ గ్లోబెల్ 2020 జాబితాలోని ఇండియన్ కంపెనీలు ఇవే

ఫార్చ్యూన్ గ్లోబెల్ 2020 జాబితాలోని ఇండియన్ కంపెనీలు ఇవే

ఇక ఇండియన్ కంపెనీలు అయిన ఇండియన్ ఆయిల్, ఒఎన్‌జిసి, ఎస్‌బిఐ, బిపిసిఎల్, టాటా మోటార్స్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఈ జాబితాలో ఉన్న ఇతర భారతీయ కంపెనీలు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) 2020 ర్యాంకింగ్‌లో 34 స్థానాలు పడి 151 వ స్థానంలో నిలిచింది, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్‌జిసి) 190 వ స్థానంలో ఉంది, గత సంవత్సరం ర్యాంకింగ్ కంటే 30 స్థానాలు తక్కువ. 221 ర్యాంకింగ్‌తో, భారత అగ్రశ్రేణి బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఉంది . 2019 లో ఎస్బీఐ 206 స్థానంలో ఉంది .

2016 లో 215వ స్థానంలో .. ఇప్పుడు 96వ స్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్

2016 లో 215వ స్థానంలో .. ఇప్పుడు 96వ స్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్

అంతకుముందు 2012 లో, రిలయన్స్ ఇండస్ట్రీస్ 99 వ ర్యాంకులో ఉన్నప్పుడు టాప్ 100 ర్యాంకింగ్‌లోకి దూసుకెళ్లింది, కాని తరువాతి సంవత్సరాల్లో మళ్ళీ వెనుకబడి 2016 లో 215వ స్థానంలో నిలిచింది. అప్పటి నుండి ఇది క్రమంగా తన వ్యాపార కార్యాకలాపాలను విస్తరిస్తూ ముందు వరుసలోకి వచ్చే పనిలో ఉంది . ఇక భారత్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (బిపిసిఎల్) 309, టాటా మోటార్స్ 337, రాజేష్ ఎక్స్ పోర్ట్స్ 462 వ స్థానంలో ఉన్నాయి .

గత ఆర్ధిక సంవత్సరం రిలయన్స్‌కు 86.2 బిలియన్ డాలర్ల ఆదాయం

గత ఆర్ధిక సంవత్సరం రిలయన్స్‌కు 86.2 బిలియన్ డాలర్ల ఆదాయం

2020 మార్చి 31 న లేదా అంతకు ముందు ముగిసిన ఆయా ఆర్థిక సంవత్సరాలకు కంపెనీలు మొత్తం ఆదాయాల వారీగా ఈ ర్యాంకింగ్ ఇచ్చినట్టు ఫార్చ్యూన్ సంస్థ తెలిపింది.

రిలయన్స్‌కు 86.2 బిలియన్ డాలర్ల ఆదాయం ఉండగా, ఐఓసికి 69.2 బిలియన్ డాలర్ల ఆదాయం ఉంది. ఒఎన్‌జిసికి 57 బిలియన్ డాలర్లు, ఎస్‌బిఐకి 51 బిలియన్ డాలర్లు ఉన్నాయి.

English summary

ఫార్చ్యూన్ గ్లోబెల్ జాబితా: ప్రపంచంలోని టాప్ 100 కంపెనీల్లో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ | Fortune Global 500 list : Mukesh Ambani Reliance Industries in top 100 companies in the world

Billionaire Mukesh Ambani's oil-to-telecom conglomerate Reliance Industries has been ranked 96th in 2020 Fortune Global 500 list released today. The Indian firm jumped 10 places to break into the world's top 100 companies on the list.
Story first published: Tuesday, August 11, 2020, 18:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X