హైదరాబాద్ నగరం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCC - Global Capability Centers) కు చిరునామాగా మారుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద వాణిజ్య రియల్ ఎస్టేట్ (Commercial Real Estate - CRE) కంపెనీలలో ఒకటైన JLL Global Services (JBS) తాజాగా హైదరాబాద్ లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది హైదరాబాద్ ఆర్థిక రంగానికి, రియల్ ఎస్టేట్ మార్కెట్ కు ఒక శుభపరిణామంగా చెప్పవచ్చు.

ప్రపంచ రియల్ ఎస్టేట్ దిగ్గజం
JLL (Jones Lang LaSalle) సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉంది. ఈ సంస్థ Fortune 500 జాబితాలో కూడా స్థానం సంపాదించింది. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్, ఆస్తి నిర్వహణ, పెట్టుబడి సలహాలు వంటి అనేక సేవలను JLL అందిస్తుంది. ప్రపంచ రియల్ ఎస్టేట్ దిగ్గజాలలో మొదటి స్థానంలో ఉన్న CBRE.. ఇప్పటికే హైదరాబాద్ లో ఉంది.. తర్వాత, రెండో అతిపెద్ద కంపెనీ అయిన JLL కూడా ఇప్పుడు హైదరాబాద్ లో అడుగుపెట్టబోతోంది.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో భారీ కార్యాలయం
JLL Global Services (JBS) తమ కొత్త GCC కార్యాలయాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రీస్టిజ్ స్కైటెక్ (Prestige Skytech) లో ఏర్పాటు చేసింది. ఇక్కడ 1,21,000 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ద్వారా ఫైనాన్స్, టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఆపరేషన్స్ రంగాలలో వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అలాగే ఈ కంపెనీ రాక వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో విన్నూత్న మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ కు బెనిఫిట్ ఇదే..
హైదరాబాద్‌లోని JBS సెంటర్ ద్వారా ఇక్కడ రియల్ ఎస్టేట్ (Real Estate) సేవల్లో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది హైదరాబాద్‌ను కేవలం ఐటీ హబ్‌గా మాత్రమే కాకుండా, గ్లోబల్ ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ సేవలకు కేంద్రంగా కూడా మారుస్తోంది. ఇలాంటి కంపెనీలు తమ GCC లను ఏర్పాటు చేసుకోవడానికి హైదరాబాద్‌ను ఎంచుకోవడానికి చాలానే బలమైన కారణాలు ఉన్నాయి. నాణ్యమైన మానవ వనరులు, మెరుగైన మౌలిక సదుపాయాల వల్ల ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. అలాగే ఇక్కడి ప్రభుత్వ విధానాలు కూడా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫార్చూన్ కంపెనీలకు కేరాఫ్..
హైదరాబాద్ నగరం.. ఫార్చూన్ కంపెనీలకు కేరాఫ్ గా మారింది. హైదరాబాద్ లో ఒక్క 2025 సంవత్సరంలోనే 81 కొత్త GCC లు స్థాపించబడ్డాయి. ఈ 81 GCC లలో 34 GCC లు Fortune 500 జాబితాకు చెందిన అంతర్జాతీయ సంస్థలే కావడం విశేషం. ఈ వేగవంతమైన వృద్ధి.. స్థానిక రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తుంది. కొత్త ఆఫీస్ స్పేస్‌లకు డిమాండ్ పెరిగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. JLL వంటి దిగ్గజాల రాకతో హైదరాబాద్ ప్రపంచ పటంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications