Youtube: యూట్యూబ్ లో విషాదం.. అస్సలు ఏం జరిగిందంటే..!
గూగుల్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ యూట్యూబ్ లో విషాదం జరిగింది. యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వోజ్కికీ కుమారుడు (19ఏళ్లు) మాక్రో ట్రోపర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని సుసాన్ వోజ్కికీ తెలిలింది." నిన్న నా కుటుంబంలో విషాదం జరిగింది. నా ప్రియమైన మనవడు మార్కో ట్రోపర్ మరణించాడు. మార్కో అత్యంత దయగల, ప్రేమగల, తెలివైన, ఆహ్లాదకరమైన, అందమైన యువకుడు. అతను UC బర్కిలీలో గణితంలో తన మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్‌ను చదువుతున్నాడు" అని పేర్కొంది.
"అతను స్టెర్న్ హాల్‌లోని అతని వసతి గృహంలో ఉంటున్నాడు. అతను తన జీవితం, బర్కిలీలోని స్నేహితుల గురించి మాకు చెబుతాడు. మార్కో జీవితం చాలా చిన్నది. అతను కోల్పోయే అన్ని అవకాశాలు, జీవిత అనుభవాల గురించి ఆలోచిస్తూ మనం కలిసి మిస్ అవుతాము. మార్కో, మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాము. మీకు తెలిసిన దానికంటే ఎక్కువగా మిస్ అవుతున్నాము" అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

మాక్రో ట్రోపర్ మరణానికి కారణం ఇంకా తెలియలేదు. అయితే డ్రగ్ ఓవర్ డోస్ కారణంగానే మృతి చెందాడని వార్తలు వస్తున్నాయి.
"అతను ఒక డ్రగ్ తీసుకున్నాడు. అందులో ఏమి ఉందో మాకు తెలియదు" ఓ అధికారి తెలిపారు. సుసాన్ వోజ్కికీకి యూట్యూబ్ తో సుదీర్ఘ అనుభవం ఉంది. సుసాన్ వోజ్కికీ యూట్యూబ్ సీఈఓగా 9 ఏళ్లు పని చేశారు. వోజ్కికీ 54 ఏళ్లకు చేరడంతో తన కుటుంబంతో గడపాలని నిర్ణయించుకుంది.
దీంతో యూట్యూబ్ సీఈఓ పదవికి రాజీనామా చేసింది. తన కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలి పెట్టినట్లు ఆమె చెప్పారు. కానీ ఇంతలోనే ఆమె కుమారుడు మరణించాడం బాధకరం.


Click it and Unblock the Notifications