Shaktikanta Dasకి కొత్త పోస్ట్.. ప్రధాని మోదీ పర్సనల్ సెక్రటరీగా నియామకం..!
RBI Governor: కొన్ని వారాల కింద వరకు రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా శక్తికాంతదాస్ పనిచేసిన సంగతి తెలిసిందే. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాస్ రిజర్వు బ్యాంకులో గవర్నర్ స్థాయిలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మోదీ మూడో టర్మ్ కింద కూడా దాస్ పదవి పొడిగింపబడుతుందని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. జీడీపీ వృద్ధి రేటు దిగజారటంతో ఆయనను పక్కకు తప్పించిన సంగతి తెలిసిందే.
అయితే భారత ప్రభుత్వం నేడు విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌ను ప్రధాని మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా నియమితులయ్యారు. శక్తికాంతదాస్ పదవీకాలం ప్రధానమంత్రి పదవీకాలంతో లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతుంది. అయితే దీనిపై క్లారిటీ తర్వాత వెలువడే ఉత్తర్వులపైనే ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి ఆయన ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అని మనందరికీ కెలిసిందే.

సెప్టెంబర్ 11, 2019 నుండి ఈ పదవిలో ఉన్న ప్రమోద్ కుమార్ మిశ్రాతో పాటు దాస్ ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ కార్యదర్శిగా వ్యవహరిస్తారని తాజా ఉత్తర్వుల ద్వారా వెల్లడైంది. ప్రమోద్ కుమార్ జూన్ 2024లో తిరిగి ప్రధాని ప్రిన్సిపల్ కార్యదర్శిగా పదవికి రెండవసారి కూడా నియమితులయ్యారు. 1972 బ్యాచ్ కి చెందిన మిశ్రా గతంలో భారత ప్రభుత్వ వ్యవసాయ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. గడచిన 10 ఏళ్లుగా ప్రధాని మోదీతో సన్నిహితంగా పనిచేస్తున్నారు. 2014-2019 మధ్య కాలంలో మోదీకి అదనపు ప్రిన్సిపల్ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు.
రిజర్వు బ్యాంక్ గవర్నర్ స్థానానికి రాకమునుపు శక్తికాంతదాస్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ అండ్ ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేశారు. దీని తర్వాత డిసెంబర్ 12, 2018న రిజర్వ్ బ్యాంక్ 25వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. పాలనలో దాస్ దాదాపు 38 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక కీలక పదవుల్లో పనిచేశారు కూడా. ఆర్థికం, పన్నులు, పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాలలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేసిన సమయంలో దాదాపు 8 కేంద్ర వార్షిక బడ్జెట్ల తయారీలో ప్రత్యక్ష పాత్ర పోషించిన అనుభవాన్ని కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications