Raghuram Rajan: దేశం అభివృద్ధి చెందుతోందని కానీ ఉద్యోగ కల్పన కూడా జరగాలి..
భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధికి సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్(Raghuram Rajan) అన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశానికి తగినంత ఉద్యోగాలను సృష్టించడానికి 8% కంటే ఎక్కువ వేగంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. శుక్రవారం బీజింగ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వీడియో లింక్ ద్వారా రాజన్ మాట్లాడారు.
"జనాభా అవసరాలు, ఉద్యోగాల ఆవశ్యకతను బట్టి మనం 8%-8.5 శాతం వేగంతో ముందుకు వెళ్లాలి. ఇతర దేశాలతో పోలిస్తే 6%-6.5% వద్ద ఆర్థిక వృద్ధి బలంగా ఉంది. కానీ మన ఉద్యోగాల అవసరానికి సంబంధించి ఇది ఇప్పటికీ కొంత నెమ్మదిగా ఉందని నేను భావిస్తున్నాను ఎందుకంటే మన దగ్గర చాలా మంది యువకులు ఉపాధి పొందవలసి ఉంది" అని రఘురామ్ రాజన్ చెప్పారు.

భారత్ విస్తరణ ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, దేశం ప్రతి సంవత్సరం శ్రామికశక్తిలో చేరే మిలియన్ల మంది ప్రజలకు తగినంత ఉద్యోగాలను సృష్టించడం లేదన్నారు. ముంబైకి చెందిన రీసెర్చర్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం, మొత్తం నిరుద్యోగిత రేటు అక్టోబర్‌లో 10.05%కి పెరిగిందని ఇది రెండేళ్ల కంటే ఎక్కువ తెలిపారు. HSBC అంచనా ప్రకారం దేశం రాబోయే 10 సంవత్సరాలలో 70 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టించవలసి ఉంటుందని గుర్తు చేశారు.
7.5% వృద్ధితో ఉద్యోగాల సమస్యలో మూడింట రెండు వంతుల సమస్య మాత్రమే పరిష్కరమవుతుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో మూడోసారి అధికారంలోకి రావాలని కోరుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అధిక నిరుద్యోగం కూడా ఆందోళన కలిగించే అశంగా రాజన్ అభిప్రాయపడ్డారు. చైనా, వియత్నాంతో సహా ఇతర సమర్థవంతమైన ఉత్పాదక దేశాలతో పోటీ పడేలా దేశం తన శ్రామికశక్తికి శిక్షణ ఇవ్వాలని రాజన్ అన్నారు. ఐఫోన్ విడిభాగాల అవుట్‌పుట్‌ను ఉటంకిస్తూ "భారతదేశం ఎగుమతులను పెంచడానికి ప్రయత్నిస్తోంది. అది జరుగుతున్న కొన్ని సంకేతాలను మీరు చూస్తున్నారు" అని చెప్పారు.


Click it and Unblock the Notifications