RBI News: భారత ఆర్థిక వ్యవస్థలో అత్యుత్తమ ఆర్బీఐ గవర్నర్లలో ఒకరుగా రఘురామ్ రాజన్ చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాలు అనేక మందిని షాక్‌కి గురిచేస్తున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఉన్నత ఉద్యోగంలో ఉన్నప్పుడు తాను అందుకున్న జీతం గురించి వెల్లడించారు. జీతం కంటే ఆర్‌బీఐ గవర్నర్‌కు అధికారిక నివాసం కేటాయించడమే పెద్ద ప్రోత్సాహకరమని రాజన్ అన్నారు. యూట్యూబర్ రాజ్ షమానీతో జరిగిన ఇంటర్వ్యూలో రాజన్ ఈ వివరాలను వెల్లడించారు. ఆయన పనిచేస్తున్నప్పుడు సంవత్సరానికి జీతం రూ.4 లక్షలుగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం వేతనం ఎంతనే విషయం మాత్రం తనకు తెలియదని అన్నారు.

ముంబైలోని మలబార్ హిల్‌లోని ధీరూభాయ్ అంబానీ ఇంటికి కొన్ని బ్లాక్‌ల దూరంలో నిజంగా పెద్ద ఇల్లు ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. ఒక సందర్భంలో ఉన్న ఇల్లు విక్రయించటం ద్వారా రూ.450 కోట్లు వస్తాయని వాటిని పెట్టుబడిగా పెట్టి రిజర్వు బ్యాంక్ ఉద్యోగుల జీతాలను చెల్లించొచ్చని పేర్కొన్నారు. అయితే అదొక అద్భుతమైన ఇల్లని పేర్కొన్నారు. రిజర్వు బ్యాంక్ గవర్నర్ హోదాలో ఉన్న సమయంలో క్యాబినెట్ సెక్రటరీతో సమానంగా వేతనాన్ని అందించారని రాజన్ వెల్లడించారు.
అయితే ఆర్‌బీఐ గవర్నర్‌కు ప్రభుత్వ అధికారులు పొందే ఇతర ప్రోత్సాహకాలు, పింఛను కూడా అండదని వెల్లడించారు. అయితే వైద్య సదుపాయాలు లభిస్తాయని అనుకుంటున్నానట్లు పేర్కొన్నారు. తాను ఎలాంటి పించన్ అందుకోవటం లేదని స్పష్టం చేశారు. పెన్షన్ రాకపోవడానికి కారణం వారు సివిల్ సర్వెంట్‌లు కావడమేనని రాజన్ వెల్లడించారు.
ఆర్‌బీఐ గవర్నర్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత రాజన్ మళ్లీ తన ఉద్యోగానికి వెళ్లిపోయారు. రఘురామ్ రాజన్ చికాగో బూత్‌లో కేథరిన్ దుసాక్ మిల్లర్ విశిష్ట సేవా ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. తనపని తాను చేసుకుంటున్నందున పెన్షన్ అవసరం లేదని వెల్లడించారు. అందువల్ల అది తనకు ఎలాంటి సమస్య లేదని పేర్కొన్నారు. పాత ఇల్లు కావటంతో దానికి మెయింటెనెన్స్, ఒక కారు ప్రభుత్వం నుంచి అందుతాయన్నారు.


Click it and Unblock the Notifications