Manmohan Singh Dead: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో గురువారం సాయంత్రం దిల్లీలోని ఎయిమ్స్‌లో అత్యవసర విభాగంలో చేరారు. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన మరణానికి సంబంధించి వార్త వెలువడింది. అయితే ఆసుపత్రి వర్గాలు కారణాలు వెల్లడించలేదు. దీంతో తన 93వ ఏట మన్మోహన్ సింగ్ ప్రాణాలు విడిచారు.
మన్మోహన్ సింగ్ పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అయితే ఆయన సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ సరళీకరించబడింది. ఆ సమయంలోనే దేశంలో గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వంటి నూతన ఆర్థిక విధానాలను అందిపుచ్చుకోవటంతో కొత్త వృద్ధి బాట పట్టింది. దీంతో ఆయన దేశం మునుపెన్నడూ చూడని ఆర్థిక వృద్ధికి నాంది పలికారు. అలాగే తర్వాతి కాలంలో ప్రధానమంత్రిగా సింగ్ భారతదేశ విదేశాంగ విధాన రూపకల్పనతో పాటు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత మధ్య USతో పౌర అణు ఒప్పందం కోసం చర్చలను ఎలా నడిపించారనే దాని గురించి చాలా అరుదుగా మాట్లాడతారు.

వాస్తవానికి 1991లో సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, భారతదేశం తీవ్రమైన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విదేశీ మారకపు నిల్వలు ప్రమాదకరంగా తక్కువ స్థాయిలకు చేరుకున్నాయి. ఆ సమయంలో కేవలం రెండు వారాల పాటు భారతదేశ దిగుమతులను కవర్ చేయడానికి కూడా అవి సరిపోని స్థితికి చేరుకున్నాయి. అలాంటి విపత్కర సమయంలో కూడా సింగ్ తన చతురతతో దేశాన్ని దివాలా నుంచి కాపాడి ముందుకు నడిపించారు. దేశంలో ధైర్యమైన సంస్కరణలు అవసరం వాటిని తీసుకురావడానికి నరసింహారావు, మన్మోహన్ సింగ్ బాధ్యత వహించారు. దాని ఫలితంగానే భారత్ వేగంగా వృద్ధి బాటలో నడిచి ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయికి ప్రస్తుతం చేరుకుందనే విషయాన్ని ఒప్పుకోకతప్పని సత్యం.
మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపట్ల ప్రధాని మోదీ ట్విట్టర్ వేధికగా స్పందించారు. భారతదేశం తన అత్యంత విశిష్ట నాయకుల్లో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ జీని కోల్పోయినందంటూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. నిరాడంబరమైన మూలాల నుండి ఎదిగి గౌరవనీయమైన ఆర్థికవేత్తగా సింగ్ ఎదిగారని గుర్తుచేసుకున్నారు. అతను ఆర్థిక మంత్రిగా సహా వివిధ ప్రభుత్వ పదవులలో పనిచేశారని, సంవత్సరాలుగా మన ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారని తెలిపారు. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన విస్తృతంగా కృషి చేశారని ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
మాజీ ప్రధాని మరణాన్ని ధృవీకరించిన ఎయిమ్స్ దీనిపై ప్రెస్ రిలీజ్ విడుదల చేస్తూ వయోభారం కారణంగా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో మన్మోహన్ సింగ్ మరణించినట్లు వెల్లడించారు. సుమారు రాత్రి 8.06 గంటలకు ఆసుపత్రికి తీసుకురాగా ఎమర్జీని రూములో చికిత్స అందించటానికి తాము అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వాటికి ఆయన శరీరం సహకరించకపోవటంతో 9.51కి మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications