Sourav Ganguly: బెంగాల్‌లో స్టీల్ ఫ్యాక్టరీ పెడుతున్న గంగూలీ.. వేల కోట్ల పెట్టుబడితో..
Sourav Ganguly: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్‌లో పెట్టుబడులతో పారిశ్రామికవేత్తగా మారుతున్నారు. మెదినీపూర్‌లోని సల్బోనీలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
12 రోజుల స్పెయిన్, దుబాయ్ పర్యటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ప్రతినిధి బృందంలో గంగూలీ కూడా ఉన్నారు. మరో ఐదు-ఆరు నెలల్లో ఫ్యాక్టరీ పనులు పూర్తవుతాయని తెలిపారు. ఇంతలో గంగూలీ ఈ ప్లాంట్‌కు సంబంధించిన తన ప్రణాళికల గురించి కూడా తెలియజేశారు. బెంగాల్‌లో మూడో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడం ప్రారంభిస్తున్నందున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే కెప్టెన్ స్టీల్ ఇండియా లిమిటెడ్‌లో గంగూలీ వాటాదారుగా ఉన్నారు.

2007లో చిన్న ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించామని గంగూలీ తెలిపారు. గురువారం మాడ్రిడ్‌లో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో గంగూలీ ప్రసంగిస్తూ.. వచ్చే ఏడాది కాలంలో అత్యాధునిక ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. 50-55 సంవత్సరాల క్రితం తన తాత ప్రారంభించిన తన కుటుంబ వ్యాపారాన్ని గురించి గంగూలీ మాట్లాడారు. దీనికోసం దాదాపు రూ.2,500 కోట్లను పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించారు. ఈ కంపెనీ ద్వారా దాదాపు 6,000 ఉద్యోగాలు కల్పించబడతాయని తెలుస్తోంది. ఇప్పటికే మొదటి రెండు ప్లాంట్లు అసన్సోల్, పాట్నాలో స్థాపించబడ్డాయి.
పశ్చిమ బెంగాల్ వ్యాపారం కోసం ప్రపంచ దేశాలను ఎప్పటి నుంచో ఆహ్వానిస్తోందని.. అందుకే ఈ రోజు సీఎం మమతా బెనర్జీ విదేశీ పర్యటన చేపట్టినట్లు గంగూలీ తెలిపారు. మమతా బెనర్జీ రాష్ట్ర అభివృద్ధికి, యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలనేది చాలా స్పష్టంగా ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications