బంగారం, బిట్‌కాయిన్ మర్చిపోండి… రాబర్ట్ కియోసాకి చెప్పిన $100 → $500 అవ్వబోయే ఇన్వెస్ట్‌మెంట్ ఇదే!
అమెరికా వ్యాపారవేత్త, రచయిత మరియు "రిచ్ డాడ్ పూర్ డాడ్" పుస్తకంతో పేరుపొందిన రాబర్ట్ కియోసాకి ఇప్పుడు బంగారం, బిట్‌కాయిన్ లాంటి పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పక్కన పెట్టి "వెండి" లోనే పెట్టుబడి పెడతానని చెప్పారు.
ఆదివారం ఆయన సోషల్ మీడియాలో ఇలా రాశారు "నా దగ్గర $100 ఉంటే నేను ఏం కొంటాను? నేను మరిన్ని వెండి నాణేలు కొంటాను. 2025 సెప్టెంబర్‌లో వెండి భారీగా పెరిగిపోతుంది. $100 పెట్టుబడి పెడితే అది ఏడాదిలో $500 అవుతుంది. అంతేకాకుండా, "వెండి ఎక్స్‌ప్లోషన్ మిస్ కావద్దు" అని ఫాలోవర్లను హెచ్చరించారు.

ఎందుకు వెండి?
కియోసాకి అభిప్రాయం ప్రకారం వెండి చాలా ఏళ్లుగా నిజమైన విలువ చూపించుకోలేకపోతుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. త్వరలోనే వెండి అసలు విలువ బయటపడుతుంది అని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఆయన బంగారం లేదా బిట్‌కాయిన్ కంటే వెండిపై ఎక్కువగా నమ్మకం పెడుతున్నారు.
కియోసాకి వెండి, బంగారం, బిట్‌కాయిన్ గురించి చాలా సార్లు అంచనాలు వ్యక్తం చేశారు. ఉదాహరణకి, 2023లో 2025 నాటికి బంగారం $5,000, వెండి $500, బిట్‌కాయిన్ $500,000 అవుతాయని ఆయన చెప్పింది. 5 ఏళ్ల క్రితం కియోసాకి US సిల్వర్ ఈగల్స్ నాణేలు $10కి ఉన్నప్పుడు పెద్ద పెట్టుబడి అవుతుందని చెప్పారు. ఆ సమయంలో $10కి ఉండే నాణేలు ఇప్పుడు $30కి చేరాయి. ఆయన చెప్పిన $50, $100, $200కి చేరడం ఇంకా బాకీ ఉంది, కానీ మొదటి అంచనాలు నిజమైంది. కొన్ని అంచనాలు సరిగ్గా వచ్చాయి కానీ, కొన్ని ఇంకా భవిష్యత్తులో చూడాలి. అందుకే ఆయన వెండి మీద ఎక్కువ నమ్మకం పెట్టారు.
బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీకోసం.. అధిక వడ్డీ రేటుతో..
నెటిజన్లు సోషల్ మీడియాలో కియోసాకి పై వివిధ రియాక్షన్‌లను ఇచ్చారు. కొందరు సెటైర్లు వేసి "20 ఏళ్లుగా మీరు ఇదే చెప్పుతున్నారు" అని వ్యాఖ్యానించారు. అంతేకాక, Xలోని AI బాట్ Grok ఆయన మిక్స్‌డ్ ట్రాక్ రికార్డ్‌ను కూడా చూపించింది. కొన్ని అంచనాలు తప్పయ్యాయి, ఉదాహరణకి 2016లో స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుందని చెప్పారు, కానీ S&P 500 9.5% పెరిగింది.
2017లో రియల్ ఎస్టేట్ క్రాష్ అవుతుందని చెప్పారు, కానీ ఇళ్ల ధరలు మరింత పెరిగాయి. అయితే కొన్ని అంచనాలు సరిగ్గా వచ్చాయి. 2002లో వచ్చిన Rich Dad's Prophecy పుస్తకంలో 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ ముందే చెప్పడం, అలాగే బిట్‌కాయిన్‌ను తొలినాళ్లలోనే సపోర్ట్ చేయడం వంటి విషయాలు సరిగ్గా నిలిచాయి.
రాబర్ట్ కియోసాకి ఈసారి వెండిని "పెద్ద ఇన్వెస్ట్‌మెంట్"గా ప్రాజెక్ట్ చేస్తున్నారు. కానీ నిజంగా వెండి $100 నుంచి $500 దాకా పెరిగిపోతున్నాయ? లేక ఇది కూడా గత అంచనాల్లాగే హైప్‌గా మిగిలిపోతుందా? అనేది ఇన్వెస్టర్లకు మిలియన్-డాలర్ ప్రశ్నగా మారింది.


Click it and Unblock the Notifications