తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బంతా పిల్లల చదువుకే ఖర్చు చేస్తూ ఉంటారు. స్కూల్ ఫీజులే ఇప్పుడు లక్షల్లో ఉంటున్నాయి. ఏటా పెరుగుతున్న ఈ ఖర్చులు చాలా కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. జీతం పెరగకపోయినా ఫీజులు మాత్రం డబుల్ స్పీడ్‌లో పెరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా చాలామంది లోన్లు తీసుకుని ఫీజులు కడుతున్నారు, ఇది ఇంకా పెద్ద ఒత్తిడిగా మారుతోంది. కానీ ఒక చిన్న SIP ట్రిక్‌తో ఈ బరువుని తేలిక చేయొచ్చని చెబుతున్నారు CA నితిన్ కౌశిక్ (FCA, LLB).
ఆయన చెప్పిన ఈ సింపుల్ ఐడియా. బిడ్డ పుట్టినప్పుడే నెలకు రూ. 10,000 SIP మొదలు పెడితే, 10 ఏళ్లలో చదువుకోడానికి కావాల్సిన డబ్బంతా రెడీ అవుతుంది. అంతేకాదు బిడ్డ 22 ఏళ్లు వచ్చే సరికి అదనంగా దాదాపు రూ. 50 లక్షలు కూడా చేతిలో మిగిలిపోతాయి. ఇంకప్పుడు చదువు ఖర్చు కోసం లోన్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. EMI టెన్షన్ కూడా ఉండదు. కేవలం స్మార్ట్ కంపౌండింగ్ మాయ మాత్రమే.

SIP ప్లాన్ ఎలా ఉంటుంది?
బిడ్డ పుట్టిన వెంటనే నెలకు రూ. 10,000 SIP స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ప్రతి సంవత్సరం దాన్ని 10% పెంచుకోవాలి. ఇది పెద్దగా భారంగా కూడా అనిపియదు. ఎందుకంటే జీతం కూడా క్రమంగా పెరుగుతూనే ఉంటుంది కదా. ఇలా 10 ఏళ్ల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే చాలు, ఆ తర్వాత ఇంకేం కాంట్రిబ్యూషన్ అవసరం ఉండదు. తర్వాత బిడ్డ వయసు 10 నుంచి 22 ఏళ్ల వరకు నెలకు రూ. 25,000 విత్‌డ్రా చేసుకుని స్కూల్, కాలేజీ ఫీజులు కట్టేయవచ్చు. ఈ లెక్క మొత్తం 12% రిటర్న్స్ మీద ఆధారపడి ఉంటుంది.
భారతదేశంలో టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ 2025
లెక్కల ప్రకారం, మీరు మొత్తం రూ. 19.12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. 10 ఏళ్లలో అది పెరిగి దాదాపు రూ. 32.69 లక్షలు అవుతుంది. తర్వాతి 12 ఏళ్లలో మీరు నెలకు రూ. 25,000 విత్‌డ్రా చేస్తూపోతే మొత్తం రూ. 36 లక్షలు ఖర్చు చేసుకుంటారు. చివరికి అకౌంట్‌లో రూ. 51 లక్షలు మిగిలిపోతాయి. కౌశిక్ చెప్పినట్టు, విత్‌డ్రా చేసుకుంటున్నా కూడా కంపౌండింగ్ పనిచేస్తూనే ఉంటుంది, అందుకే కార్పస్ కొనసాగుతూ పెరుగుతూనే ఉంటుంది.
ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మొత్తాన్ని లోన్‌గా తీసుకుంటే, దాదాపు రూ. 36 లక్షలలో ఎడ్యుకేషన్ లోన్ అవుతుంది. వడ్డీ రేటు 11% కాబట్టి, 10 ఏళ్లలో EMI దాదాపు రూ. 50,000 ప్రతినెల ఉంటుంది. అంటే SIPతో విత్‌డ్రా చేసే మొత్తంతో పోలిస్తే ఇది రెట్టింపు భారం అవుతుంది. అంతేకాదు, వడ్డీ వల్ల అదనంగా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది.
కౌశిక్ చెప్పిన కొన్ని సులభమైన టిప్స్ ఫాలో అవ్వండి. ముందుగా లో-కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అదేవిధంగా, ఎమర్జెన్సీ పరిస్థితుల కోసం కొంత డబ్బు లిక్విడిటిగా ఉంచడం చాలా అవసరం. అంతే కాకుండా ప్రతి సంవత్సరం SIP ప్రోగ్రెస్‌ని చూసుకోవడం, రివ్యూ చేయడం మర్చిపోవద్దు. ఆయన చెప్పినట్టే, 10 ఏళ్ల క్రమశిక్షణతో చేసే Step-up SIP, 10 ఏళ్ల ఓవర్‌టైమ్ కంటే ఎక్కువ పనిచేస్తుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications