భారత్‌లో ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటిదాకా 2జీ, 4జీ, 5జీ ప్రపంచాన్ని చూసిన యూజర్లు త్వరలో ఏకంగా 100 జీ చూడబోతున్నారు. దీనికి వేదికగా భారత్ మారబోతోంది. ప్రముఖ దిగ్గజం ఈ టెక్నాలజీపై గట్టిగా కృషి చేస్తోంది. సాధారణంగా ఇంటర్నెట్ అనేది మన జీవితాలో విడదీయలేని భాగం అయిపోయింది. టెక్నాలజీ అమిత వేగంతో దూసుకుపోతోంది.
ఒకప్పుడు నెమ్మదిగా లోడ్ అయ్యే వెబ్‌పేజీలు, వీడియోలు బఫర్ అవుతూ ఆగిపోవడం సాధారణంగా ఉండేది. కానీ స్మార్ట్‌ఫోన్‌లు విస్తృతంగా అందుబాటులోకి రావడం, 4G ఇంటర్నెట్ ప్రవేశంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన డేటా సేవలు అందించడానికి టెలికాం కంపెనీల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఈ పోటీ కారణంగా ఇంటర్నెట్ టెక్నాలజీలో భారీ స్థాయిలో పరిశోధన, అభివృద్ధి జరుగుతోంది.

ఈ క్రమంలోనే ప్రపంచ ప్రసిద్ధ టెలికాం సంస్థ నోకియా భారత్‌లో ఒక కీలక ముందడుగు వేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలో నోకియా తన అతిపెద్ద నెట్‌వర్క్ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం ఏమిటంటే భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచే టెక్నాలజీలను అభివృద్ధి చేయడం. ఇక్కడ జరుగుతున్న ముఖ్యమైన పరిశోధనల్లో ఒకటి ఏంటంటే.. 100G ఇంటర్నెట్ టెక్నాలజీ.
అయితే, ఈ 100G ఇంటర్నెట్ అంటే ఏమిటి అని చాలామందికి అనుమానం రావొచ్చు. క్లుప్తంగా చెప్పాలంటేడ 100G అంటే సెకనుకు 100 గిగాబిట్‌ల డేటా బదిలీ వేగం (100 Gbps). ప్రస్తుతం మనం చాలా వేగంగా భావించే 100 Mbps లేదా 1 Gbps కనెక్షన్లతో పోలిస్తే ఇది వందల రెట్లు అధిక సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ డేటా ప్రసరణను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది.
100G ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇందులో డేటా విద్యుత్ సంకేతాలుగా కాకుండా.. కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. ఈ ప్రక్రియలో కోహెరెంట్ ఆప్టిక్స్ అనే ఆధునిక సాంకేతికత ఉపయోగించబడుతుంది. దీని ద్వారా ఒకే ఫైబర్ కేబుల్ ద్వారా భారీ మొత్తంలో డేటాను ఒకేసారి పంపడం సాధ్యమవుతుంది. చెన్నైలోని నోకియా పరిశోధనా కేంద్రం ఈ టెక్నాలజీని మరింత సమర్థవంతంగా మార్చే పనిలో ఉంది.
100G వంటి సూపర్ ఫాస్ట్ వేగాలను సాధించడానికి DWDM (Dense Wavelength Division Multiplexing) కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని ఒకే రహదారిపై వేర్వేరు రంగుల వాహనాలు వెళ్లినట్లుగా ఊహించవచ్చు. ఒకే ఫైబర్ కేబుల్‌లో వేర్వేరు కాంతి తరంగదైర్ఘ్యాలను ఉపయోగించి డేటాను ప్రసారం చేయడం ద్వారా, ఈ టెక్నాలజీ ఖర్చును తగ్గిస్తూ సామర్థ్యాన్ని పెంచుతుంది. చెన్నై ల్యాబ్‌లో 10G నుంచి 100G వరకు నెట్‌వర్క్‌లను పరీక్షించడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు.
ఇప్పట్లో 100G ఇంటర్నెట్ నేరుగా మన ఇళ్లకు రాకపోయినా, దాని ప్రభావం మనకు తప్పకుండా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న 5G సేవలను మరింత బలోపేతం చేస్తుంది. రాబోయే 6G టెక్నాలజీకి పునాది వేస్తుంది. బలమైన నెట్‌వర్క్ వెన్నెముక వల్ల బఫర్ లేని వీడియో స్ట్రీమింగ్, వేగవంతమైన క్లౌడ్ సేవలు, మెరుగైన ఆన్‌లైన్ గేమింగ్, విశ్వసనీయ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి వస్తాయి.
ఏదేమైనా 100G టెక్నాలజీ భారత్‌ను భవిష్యత్ డిజిటల్ ప్రపంచానికి సిద్ధం చేసే కీలక అడుగు. ఈ పరిశోధనలు విజయవంతమైతే, రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నెట్‌వర్క్ దేశాలలో ఒకటిగా నిలవడం ఖాయం.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications