FPI News: ఎన్నికల ప్రచార హీటు దేశీయ స్టాక్ మార్కెట్లను తాకుతోంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతల ఎన్నికల సరళిలో దాదాపు పోలింగ్ శాతం 65 శాతం సగటును దాటలేదు. ఇది దేశీయ ఇన్వెస్టర్లతో పాటు విదేశీ పెట్టుబడిదారులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి, చైనా మార్కెట్లలో ఆకర్షణీయమైన వాల్యుయేషన్ల కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మే నెలలో ఇప్పటివరకు భారత స్టాక్ మార్కెట్ల నుంచి రూ.28,200 కోట్లను ఉపసంహరించుకున్నారు. మారిషస్‌తో భారత పన్ను ఒప్పందంలో మార్పులు, అమెరికాలో పెరుగుతున్న బాండ్ ఈల్డ్‌లపై ఆందోళనల మధ్య FPIలు ఏప్రిల్‌లో స్టాక్‌ల నుండి నికర రూ.8,700 కోట్లను ఉపసంహరించుకున్నారు.

రాజకీయ స్థిరత్వం ఏర్పడిన పక్షంలో డిపాజిటరీ డేటా ప్రకారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెల వరకు నికరంగా రూ.28,242 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ వెల్లడించారు. ముందుగా ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొంది. FPIలు సాధారణంగా అనిశ్చితి విషయంలో సురక్షితమైన విధానాన్ని అవలంబిస్తాయి. దీనికి తోడు మార్కెట్ విలువలు తక్కువగా ఉండటతో విదేశీ ప్రైవేట్ ఇన్వెస్టర్లు విక్రయాలకు దిగుతున్నారు.
సమీక్షలో ఉన్న కాలంలో ఎఫ్‌పీఐలు రూ.178 కోట్లను డెట్ లేదా బాండ్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాయి. అంతకుముందు మార్చిలో బాండ్ మార్కెట్‌లో ఎఫ్‌పీఐలు రూ.13,602 కోట్లు, ఫిబ్రవరిలో రూ.22,419 కోట్లు, జనవరిలో రూ.19,836 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు రూ.26,000 కోట్లను షేర్ల నుంచి ఉపసంహరించుకున్నాయి. అయితే ఈ కాలంలో వారు బాండ్ మార్కెట్‌లోకి రూ.45,000 కోట్లను తరలించారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను తగ్గించనున్నదన్న అంచనాలతో గత వారం దాదాపు రెండు శాతం పెరిగిన దేశీయ స్టాక్ మార్కెట్ వచ్చే వారం పెద్ద కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ఐదో దశలో ఓటింగ్ శాతంపై ఆధారపడి ఉండనున్నాయి. వచ్చే వారం NTPC, ONGC, OIL, SAIL, ITC, BEL, BHEL, HUDCO, Suzlon, India Cement, IRCON, BCCL, ICRA, Indigo సహా అనేక పెద్ద కంపెనీల 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిసిన కాలానికి తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే గత నాలుగు దశల ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల ఐదో దశ ఓటింగ్ శాతం మార్కెట్ పై ప్రభావం చూపనుంది.


Click it and Unblock the Notifications