Chennai Petroleum: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ పతనం నెలకొంది. ఒకపక్క అనేక కంపెనీల షేర్లు నష్టాల్లోకి జారుకుంటుంటే.. ఒక ప్రభుత్వ యాజమాన్య కంపెనీలో మాత్రం లాభాల పంట పండుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రభుత్వ రిఫైనరీ కంపెనీ చెన్నై పెట్రోలియం గురించే. స్టాక్ మార్కెట్ల పతనంలోనూ ఈ స్టాక్ తన సత్తా చాటింది. ఈ షేర్లలో భారీ పెరుగుదల కనిపించింది. వారంలోని మూడో ట్రేడింగ్ రోజున ఈ షేరు 3 శాతానికి పైగా పెరిగి రూ.868.20కి చేరుకుంది.

చెన్నై పెట్రోలియంపై విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతోంది. కంపెనీ షేర్‌హోల్డింగ్ పరిశీలిస్తే.. డిసెంబర్ త్రైమాసికంలో ఎఫ్‌ఐఐ వాటా 14.7% స్థాయికి చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఎఫ్‌ఐఐలు కంపెనీలో 4.7% వాటాను మాత్రమే కలిగి ఉన్నారు. అయితే సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో FII వాటా 11.4%.కంపెనీలోని కొన్ని ప్రధాన విదేశీ పెట్టుబడిదారుల్లో పొలునిన్ ఎమర్జింగ్ మార్కెట్స్ స్మాల్ క్యాప్ ఫండ్ LLC, సిటీ ఆఫ్ న్యూయార్క్ గ్రూప్ ట్రస్ట్ ఉండటం గమనార్హం.
ఇదే క్రమంలో ప్రముఖ పెట్టుబడిదారు డాలీ ఖన్నా కంపెనీలో తన వాటాను తగ్గించుకున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో 1.62 శాతంగా ఉన్న హోల్డింగ్స్ డిసెంబర్ త్రైమాసికంలో 1.32 శాతానికి తగ్గాయి. డిసెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి ప్రమోటర్లు కంపెనీలో 67.3% వాటాను కలిగి ఉండగా, రిటైల్ ఇన్వెస్టర్లు 16.8%, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు 1.2% వాటాలను కలిగి ఉన్నారు. గడచిన రెండేళ్ల కాలంలో కంపెనీ ఇన్వెస్టర్లకు బలమైన రాబడులను అందించింది. ఈ క్రమంలో మల్టీబ్యాగర్ స్టాక్ 237 శాతం రాబడితో.. స్టాక్ ధర రూ.206 స్థాయి నుంచి రూ.697కి చేరుకుంది.
2020లో స్టాక్ కనిష్ఠంగా రూ.47.70 రేటు వద్ద ఉండగా జనవరి 15న రూ.907.95 గరిష్ఠ మార్కును అందుకుంది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు జనవరి 22, 2024న విడుదలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.1,195 కోట్ల లాభాన్ని సాధించింది. ఇది ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ. 556 కోట్ల కంటే 115% ఎక్కువ. Q2FY24లో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.14,745 కోట్లతో పోలిస్తే రూ.16,545 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications