FCNR: భారీగా పెరిగిన ప్రవాస భారతీయుల విదేశీ కరెన్సీ డిపాజిట్లు..

ప్రవాస భారతీయుల విదేశీ కరెన్సీ డిపాజిట్లు కేవలం 45 రోజుల్లోనే భారీగా సేకరించినట్లు ఎస్‌బిఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఇది 2013 ప్రత్యేక డిపాజిట్ పథకం కింద సేకరించిన మొత్తం కంటే ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్‌బిఐ చర్యలతో మొత్తం నిధుల సమీకరణ చివరికి 80-85 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కూడా రీసెర్చ్ నివేదిక అంచనా వేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 17 వరకు మొత్తం నిధుల ప్రవాహం దాదాపు 20.7 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని నివేదించింది. ఇందులో ఎఫ్‌సిఎన్‌ఆర్(బి) డిపాజిట్ల ద్వారా వచ్చిన 17.4 బిలియన్ డాలర్లు కూడా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ ఫారీన్ కరెన్సీ నాన్-రెసిడెంట్(బి) డిపాజిట్లు ఇప్పటికే 2013 పథకం కింద సమీకరించిన 26 బిలియన్ డాలర్లను దాటాయని ఎస్‌బిఐ అంచనా వేస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి దాదాపు మూడు నెలల సమయం పట్టిందని వివరించింది. ఈ పథకం ముగిసే నాటికి ఎఫ్‌సిఎన్‌ఆర్(బి) డిపాజిట్లు 65-70 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని ఎస్‌బిఐ రీసెర్చ్ అంచనా వేస్తోంది. ఇది గతంలో అంచనా వేసిన 40-45 బిలియన్ డాలర్ల కంటే చాలా ఎక్కువ. విదేశీ విదేశీ కరెన్సీ రుణాలు, బాహ్య వాణిజ్య రుణాలు కలుపుకొని, మొత్తం నిధుల సేకరణ 80-85 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నివేదిక అంచనా వేస్తోంది. ఈ సమీకరణకు ప్రభుత్వ రంగ బ్యాంకులే ప్రధానంగా పనిచేసే అవకాశం ఉందని తెలిపింది.

FCNR

అధిక వడ్డీ రేట్ల కారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మెచ్యూర్ అయ్యే ఫారీన్ కరెన్సీ నాన్-రెసిడెంట్(B) డిపాజిట్లలో గణనీయమైన భాగాన్ని కొత్త పథకం కింద తిరిగి పొందే అవకాశం ఉంది.కేవలం ఈ పునరుద్ధరణల నుంచే 10 బిలియన్ డాలర్లు రావచ్చని ఎస్‌బిఐ రీసెర్చ్ పేర్కొంది. జూలై 17 వరకు ఫారీన్ కరెన్సీ నాన్-రెసిడెంట్(B) ప్రవాహాలు 17.4 బిలియన్ డాలర్లుగా ఉండగా, జూన్ 8 నుంచి ఎఫ్‌సిఏ కేవలం 7.6 బిలియన్ డాలర్లు మాత్రమే పెరిగిందని అది తెలిపింది. జూలై నెలాఖరు నాటికి ఎఫ్‌సిఏ వృద్ధి 17-20 బిలియన్ డాలర్లకు చేరుతుందన నివేదిక అంచనా వేసింది.
అయితే రూపాయి బలహీనపడుతూనే ఉందని, విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో ఆర్‌బిఐ జోక్యం తగినంత బలంగా లేదని రీసెర్చ్ నివేదికలో పేర్కొంది.

భారతదేశానికి దాదాని 676 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉందని తెలిపింది. 1997-98లో సగటు జోక్యం రోజుకు సుమారు 55 మిలియన్ ఉండేది. ఈ చర్యలకు ముందు 65-70 బిలియన్ డాలర్ల లోటు ఉంటుందని అంచనా వేసినప్పటికీ, 2026-27 ఆర్థిక సంవత్సరంలో చెల్లింపుల సమతుల్యత 50 బిలియన్ డాలర్లకు పైగా మిగులు స్థాయికి మారుతుందని ఎస్‌బీఐ (SBI) పేర్కొంది. అలాగే, కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 1.0-1.2 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేసింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+