Paytm crisis: విధ్వంసానికి సిద్ధమైన పేటీఎం స్టాక్.. షేర్లున్నోళ్లకు భారీ హెచ్చరిక..
Paytm Shares: ఫిన్‌టెక్ స్టార్టప్ పేటీఎం అతిపెద్ద సమస్యల్లోకి కూరుకుపోయింది. ఈ క్రమంలో ప్రముఖ విదేశీ బ్రోకరేజ్ సంస్థ మాక్విర్ పేటీఎం కంపెనీ షేర్లపై సంచలన నివేదికను వెల్లడించింది. దీంతో పేటీఎం కంపెనీ ఇన్వెస్టర్లలో గుబులు పట్టుకుంది.
పేటీఎం షేర్లకు మాక్విర్ అండర్ పెర్ఫార్మింగ్ రేటింగ్ ఇవ్వటంతో ఆందోళనలు మెుదలయ్యాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్ల టార్గెట్ ధరను రూ.650 స్థాయి నుంచి రూ.275కి తగ్గించింది. పేటీఎం తన పేమెంట్స్ బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన తర్వాత పేటీఎం కస్టమర్ ఎక్సోడస్‌కు తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని విశ్లేషకుడు సురేష్ గణపతి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆర్బీఐ చర్యలు పేటీఎం వ్యాపార నమూనాను, లాభదాయకత, ఆదాయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అభిప్రాయపడింది.

ఈరోజు ఎన్ఎస్ఈలో పేటీఎం స్టాక్ ధర ఉదయం 10 గంటల సమయంలో 6 శాతానికి పైగా నష్టపోయి రూ.396.55 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. రానున్న కాలంలో పేటీఎం షేర్ల విలువ మరింతగా దిగజారనుందని బ్రోకరేజ్ అంచనాలతో నష్టనివారణ చర్యల్లో ఇన్వెస్టర్లు తలమునకలయ్యారు. ఇంత ఒత్తిడికరమైన పరిస్థితుల్లో రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విషయంలో తమ కఠిన వైఖరి కొనసాగుతుందని.. తమ నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని తేల్చి చెప్పేశారు. పేటీఎంపై ఆంక్షలను తిరిగి పరిశీలించే ఆలోచన అస్సలు లేదని చెప్పటం పెట్టుబడిదారులకు ఆందోళనలను పెంచేస్తోంది.
పేటీఎం విషయంలో ఆందోళనల వివరాలను ఆర్‌బీఐ అందించనప్పటికీ.. ఫిబ్రవరి 29 తర్వాత ఏవైనా వడ్డీ, క్యాష్‌బ్యాక్‌లు కాకుండా కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, ఎన్‌సీఎంసీ కార్డ్‌లలో డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్ అప్‌లను స్వీకరించడాన్ని నిలిపివేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను ఆదేశించింది. ఆర్బీఐ ఆంక్షల కారణంగా పేటీఎం ఆదాయం 60 శాతానికి పైగా తగ్గే అవకాశం ఉందని బ్రోకరేజ్ తన తాజా అంచనాల్లో ప్రకటించింది. అలాగే కస్టమర్లు పేటీఎం సేవల వినియోగం నుంచి ఇతరులకు మారటం ఆదాయ ఆందోళనలకు కారణంగా పేర్కొంది.


Click it and Unblock the Notifications