Jewellery Stock: కల్యాణ్ జ్యువెలర్స్‌కు బ్రోకరేజ్ కొత్త టార్గెట్ ధర.. కొన్నోళ్లకి కాసుల వర్షమేగా..
Kalyan Jewellers Share: భారతీయ పసిడి ప్రియులు కొందరు రియల్ గోల్డ్ కొంటుండగా.. మరో పక్క ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్లు జ్యువెలరీ స్టాక్స్ పై బులిష్ వ్యూహాంతో ముందుకు సాగుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కళ్యాణ్ జ్యువెలర్స్ కంపెనీ షేర్ల గురించే. నేడు ఇంట్రాడేలో జ్యువెలరీ స్టాక్ ధర 4 శాతానికి పైగా లాభపడి రూ.రూ.683కి చేరాయి. దీంతో కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లు తమ కొత్త 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గ్లోబల్ బ్రోకరేజ్ హౌస్ HSBC కంపెనీ షేర్లపై సానుకూల వైఖరిని కొనసాగించింది. ఈ క్రమంలో రానున్న కాలంలో కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ ధర రూ.800 స్థాయిని అధిగమిస్తుందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది.

విదేశీ బ్రోకరేజ్ హెచ్‌ఎస్‌బీసీ కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లను BUY రేటింగ్ అందించింది. ఈ క్రమంలో కళ్యాణ్ జువెలర్స్ ఒక్కో షేరుకు టార్గెట్ ధరను రూ.810గా బ్రోకరేజ్ నిర్ణయించింది. గతంలో కంపెనీ షేర్లకు బ్రోకరేజ్ రూ.600 టార్గెట్ ధరగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బుధవారం ట్రేడింగ్ సెషన్లో స్టాక్ ధర రూ.656.60 వద్ద ముగిసింది. ఈ స్థాయి నుంచి కంపెనీ షేర్లలో దాదాపు 23% పెరుగుదల కనిపించింది. ఇదే క్రమంలో కంపెనీ షేర్ల 52 వారాల కనిష్ఠ ధర రూ.202.60గా ఉంది. అయితే ఇటీవల గోల్డ్ విక్రయాలకు దేశంలో పెరుగుతున్న డిమాండ్, భారత ప్రభుత్వం హాల్ మార్కింగ్ వంటి మార్పులు వ్యాపార పెరుగుదలకు దారితీస్తున్నాయి.
బ్రోకరేజ్ హౌస్ హెచ్‌ఎస్‌బీసీ తన నోట్‌లో కంపెనీ షేర్లు గత 2 ఏళ్లలో 8 రెట్లు పెరిగాయని వెల్లడించింది. కంపెనీ షేర్లు ప్రస్తుతం తమ విలువ సృష్టి ప్రయాణం మధ్యలో ఉన్నాయని నివేదికలో పేర్కొంది. అలాగే గడచిన మూడేళ్ల కాలంలో కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లు 925% కంటే ఎక్కువ రాబడిని తమ ఇన్వెస్టర్లకు అందించాయి. ఇక గడచిన ఏడాది కాలంలో 200 శాతం, ఆరునెలల్లో 77 శాతానికి పైగా బలమైన రాబడులను పెట్టుబడిదారులు జ్యువెలరీ స్టాక్ నుంచి పొందారు.


Click it and Unblock the Notifications