Adani Green Energy: అదానీ గ్రూప్ కంపెనీల్లో దేశంలోని లక్షలాది మంది ఇన్వెస్టర్లు చాలా కాలం నుంచి తమ పెట్టుబడులను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్ఐసీతో పాటు విదేశీ సంస్థలు సైతం భారీగా పెట్టుబడులు పెట్టాయి.
ఈ క్రమంలో విదేశీ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తాజాగా అదానీ గ్రూప్ కంపెనీపై తన అంచనాలను ప్రకటించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు రానున్న కాలంలో ఇన్వెస్టర్లకు భారీ లాభాల బహుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పడు జెఫరీస్ సానుకూలత వ్యక్తం చేసిన అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో ఇంట్రాడేలో 1.63 శాతం లాభంతో రూ.1,833.15 వద్ద 11.35 గంట సమయంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో జెఫరీస్ అదానీ గ్రీన్ షేర్లకు BUY రేటింగ్ అందించింది.

రానున్న కాలంలో అదానీ గ్రీన్ స్టాక్ ధర రూ.2130 స్థాయికి చేరుకుంటుందని టార్గట్ ధరను ఫిక్స్ చేసింది. ఇది శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో కంపెనీ షేర్ ధర కంటే దాదాపు 18 శాతం అధికం. అయితే జెఫరీస్ ప్రస్తుతం ఇచ్చిన టార్గెట్ ధర కంపెనీ 52 వారాల గరిష్ఠ స్థాయి కంటే తక్కువ కావటం గమనార్హం. వాస్తవానికి అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.2173.65గా ఉంది.
కంపెనీ 2030 నాటికి సామర్థ్యాన్ని 11 GW నుంచి 50 GWకి పెంచే ప్రయాణంలో ఉందని బ్రోకరేజ్ పేర్కొంది. అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్‌లో ఒకే ప్రదేశంలో 538 చదరపు కిలోమీటర్ల భూమిని కలిగి ఉంది. గుజరాత్‌లోని ఖవ్రా ప్రదేశం కంపెనీ ప్రణాళికాబద్ధమైన 50 GW సామర్థ్యంలో 30 GW సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
గత ఏడాది కాలంలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లు 67% పెరిగాయి. జూలై 31, 2023న కంపెనీ షేర్లు రూ.1093.10 వద్ద ఉన్నాయి. 29 జూలై 2024న కంపెనీ షేర్లు రూ.1826.95కి చేరుకున్నాయి. అదే సమయంలో గత 17 నెలల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 275% పెరిగాయి. అలాగే 5 ఏళ్ల కాలంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 3790% పెరిగాయి. ఆగస్టు 2, 2019న కంపెనీ షేర్లు రూ.46.95 వద్ద ఉన్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 29 జూలై 2024న రూ.1826.95కి చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications