IPO News: నిమిషాల్లో డబ్బు డబుల్.. ఐపీవో లిస్టింగ్ రచ్చ, మీరూ బెట్ వేశారా?
Forcas Studio IPO: ఈరోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన రెండు ఐపీవోలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. దీంతో పండుగ రోజున బెట్టింగ్ వేసిన పెట్టుబడిదారులు సంతోషంలో ఉన్నారు. డబ్బును దాదాపు డబుల్ కావటంతో అందరి దృష్టి ఈ ఐపీవోపై ఉంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఫోర్కాస్ స్టూడియో కంపెనీ ఐపీవో గురించే. మార్కెట్‌లో కంపెనీ షేర్లు బలమైన లిస్టింగ్‌ను నమోదు చేశాయి. ఈ క్రమంలో లిస్టింగ్ రోజున ఇష్యూ ధరతో పోలిస్తే కంపెనీ షేర్ల ధర రెండింతలు కావటంతో పెట్టుబడిదారులు మెుదటి రోజే తమ పెట్టుబడి సొమ్మును రెట్టింపు చేసుకున్నారు. అలాగే లిస్టింగ్ తర్వాత సైతం మార్కెట్లో కంపెనీ షేర్ల కొనుగోలుకు డిమాండ్ భారీగా కనిపించింది.

ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఫోర్కాస్ స్టూడియో స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన లిస్టింగ్ ద్వారా పెట్టుబడిదారులను ధనవంతులను మార్చేసింది. వాస్తవానికి కంపెనీ ఇష్యూ సమయంలో ఒక్కో షేరుకు అప్పర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.80 వద్ద విక్రయించగా.. నేడు మార్కెట్లో 90 శాతం ప్రీమియం ధర వద్ద ఒక్కో షేరు రూ.152 రేటుకు మార్కెట్లో జాబితా అయ్యాయి. అలాగే అద్భుతమైన లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకి రూ.159.60 రేటుకు ఎగబాకాయి.
ఈ క్రమంలో కంపెనీ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను కంపెనీ రూ.77-80గా ఉంచింది. ఐపీవోలో పాల్గొనేందుకు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఆగస్టు 19 నుంచి ఆగస్టు 21 వరకు అవకాశం కల్పించబడింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.37.44 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందుకోసం 46.80 లక్షల షేర్లను జారీ చేసింది. ఇదే క్రమంలో లాట్ పరిమాణాన్ని కంపెనీ 1600 షేర్లుగా నిర్ణయించింది. ఐపీవోకి ముందర కంపెనీ ప్రమోటర్లు శైలేష్ అగర్వాల్, సౌరవ్ అగర్వాల్ మొత్తం 82.17 శాతం వాటాను కలిగి ఉన్నారు. అయితే ప్రస్తుతం వారి వాటా 60.30 శాతానికి పరిమితమైంది.


Click it and Unblock the Notifications