Mutual Funds: ఎలాంటి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే బెటర్..!
పెట్టుబడిదారులు సాధారణంగా జనాదరణ పొందిన మ్యూచువల్ ఫండ్ పేర్లను చూసి వాటిలో పెట్టుబడి పెడతారు. అయితే అధిక AUM (ఆస్తుల నిర్వహణ) ఉన్న స్మాల్-క్యాప్ ఫండ్‌లు తప్పనిసరిగా మెరుగైన రాబడులను అందించవని గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. AUM (ఆస్తుల నిర్వహణ) అంటే ఒక మ్యూచువల్ ఫండ్ పథకం తన పెట్టుబడిదారుల తరపున నిర్వహించే ఆస్తులు, నగదు మొత్తం మార్కెట్ విలువ. అతిపెద్ద పథకమైన నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ రూ.80,906 కోట్ల AUMతో 23 అక్టోబర్ 2026 నాటికి 1-సంవత్సరంలో -1.40% రాబడిని అందించింది. రెండో అతిపెద్ద పథకమైన ఎస్‌బిఐ స్మాల్ క్యాప్ ఫండ్ రూ.41,059 కోట్ల AUMతో -2.33% ప్రతికూల రాబడిని నమోదు చేసింది.
దీనికి విరుద్ధంగా రూ.841 కోట్ల AUM కలిగిన ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ ఫండ్, ఒక సంవత్సరంలో 5.64% రాబడిని అందించగా రూ.3,671 కోట్ల AUM కలిగిన బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఈ విభాగంలోనే అత్యధికంగా 16.71% రాబడిని ఇచ్చింది. చిన్న పథకాలు తమ పెద్ద పథకాల కంటే ఎందుకు మెరుగైన పనితీరును కనబరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. స్మాల్-క్యాప్ స్టాక్‌లు తరచుగా తక్కువ పరిమాణంలో ట్రేడ్ అవుతాయని గుర్తు చేశారు. నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఎల్ఐసి ఎంఎఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ ఫండ్ మేనేజర్లు ఒకే ఆశాజనకమైన కంపెనీని గుర్తించారని అనుకుంటే.

ఇద్దరూ తమ తమ పోర్ట్‌ఫోలియోలలో 2 శాతం ఆ స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. సుమారుగా రూ.841 కోట్లు నిర్వహించే ఎల్ఐసికి 2 శాతం కేటాయింపు అంటే సుమారు రూ.16.82 కోట్లు పెట్టుబడి పెట్టడం. దాదాపు రూ.80,906 కోట్ల నిధులను నిర్వహిస్తున్న నిప్పన్‌కు, ఇదే కేటాయింపు కోసం దాదాపు రూ.1,618 కోట్లు అవసరమవుతాయి. ఇప్పుడు, ఆ కంపెనీకి సగటున ఒక రోజులో రూ.20 కోట్ల విలువైన షేర్లు ట్రేడ్ అవుతున్నాయని ఊహించుకుంటే. ఎల్ఐసీ సిద్ధాంతపరంగా సుమారు 9 ట్రేడింగ్ సెషన్లలో తన కొనుగోలును పూర్తి చేయగలదు.
అవే అంచనాల ప్రకారం నిప్పన్‌కు 800 కంటే ఎక్కువ ట్రేడింగ్ సెషన్లు అవసరమవుతాయి. ఎల్ఐసీ స్మాల్ క్యాప్ ఫండ్ 15.65% రాబడిని అందించగా, నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఐదేళ్లలో 17.04% వార్షిక రాబడిని అందించింది. ఏడేళ్లలో నిప్పన్ వార్షికంగా 25.24% రాబడిని ఇవ్వగా, LIC 21.45% రాబడిని ఇచ్చింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications