Gold Investments: బంగారంపై ఎలా పెట్టుబడి పెట్టాలి..!
భారతీయ మహిళలకు బంగారం చాలా ఇష్టం. అందుకే పెళ్లి సందర్భంలో భారీగా పసిడిని కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పుత్తడి కొనుగోలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బంగారం కొనుగోలు మంచి అలవాటు అని నిపుణులు చెబుతున్నారు. పసిడి అనేది సురక్షితమైన పెట్టుబడిగా వారు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరిగింది. ఈ పసిడి ధరను గత రెండేళ్లుగా పరిశీలిస్తే భారీగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు బంగారం కేవలం అలంకారం కోసం కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బంగారం కొనుగోలు చేయడమే కాదు.. అవసరం ఉన్నప్పుడు బంగారం తాకట్టు పెట్టి గోల్డు లోన్ తీసుకుంటున్నారు.
ప్రస్తుతం చాలా మంది బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. దీని ప్రధాన కారణం ధరలు భారీగా పెరగడం. భవిష్యత్తులో పసిడికి డిమాండ్ ఉంటుందన్న నేపథ్యంలో చాలా మంది బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. అయితే పసిడిపై పెట్టుబడులు ఏ రూపంలో పెడితే బెటరని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఒకప్పుడు ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు వచ్చాయి. గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఫిజికల్ గోల్డ్ కాకుండా డిజిటల్ గా పెట్టుబడి పెట్టడం మంచిది.

ఫిజికల్ గా బంగారం కొనుగోలు చేయాలంటే భారీ మొత్తంలో డబ్బులు కావాలి. పసిడి కొనుగోలు చేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా దాయాలి. కానీ డిజిటల్ రూపంలో పెట్టుబడి పెడితే తక్కువ మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. ఉదాహరణకు పావు తులం బంగారం కొనుగోలు చేయాలంటే రూ.35 వేల నుంచి రూ.40 వేలు కావాలి. కానీ మీరు గోల్డ్ ఫండ్స్ లేదా గోల్డ్ ఈటీఎఫ్ రూ.500 నుంచి కూడా పెట్టుబడి పెట్టొచ్చు. అలాగే డిజిటల్ గా బంగారం కొనుగోలు చేయవచ్చు. మీరు రూ.500 పెట్టుబడి డిజిటల్ గా బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా మ్యూచువల్ ఫండ్ హౌస్ లు బంగారంపై పెట్టుబడులు స్వీకరించడం లేదు. ఇప్పటికే భారీగా పెట్టుబడులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే బంగారంపై పెట్టుబడి పెట్టేటప్పుడు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలా లేదా క్రమక్రమంగా పెట్టుబడి పెట్టాలా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. ప్రస్తుత తరుణంలో పసిడిలో పెట్టుబడి పెట్టేవారు క్రమక్రమంగా పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే పుత్తడి ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ఏక మొత్తంలో పెట్టబడి పెడితే స్వల్పకాలంలో నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే నెలకు కొంత పెట్టుబడి పెడితే మంచిదని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications