దేశంలో మొట్టమెదటి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సుకు ట్రయల్స్ నిర్వహించనున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని ఎత్తైన శీతల ఎడారిలో పబ్లిక్ రోడ్లపై ఈ బస్సులను తిప్పనున్నారు. దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ NTPC, ఆశోక్ లేలాండ్ తో కలిసి ఈ బస్సులను తయారు చేసింది. ఎన్టీపీసీ ఇప్పటికే ఐదు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సులను లేహ్ అడ్మినిస్ట్రేషన్‌కు అప్పగించింది.
బస్సులకు ఇంధనం అందించేందుకు గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి 1.7 మెగావాట్ల ఇంధనం నింపే స్టేషన్, క్యాప్టివ్ సోలార్ ప్లాంట్‌ను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ నిర్మించింది. లేహ్ అడ్మినిస్ట్రేషన్ మౌలిక సదుపాయాల కోసం నగరంలో 7.5 ఎకరాల భూమిని లీజుకు తీసుకుంది. అశోక్ లేలాండ్ ఏప్రిల్ 2020లో గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఒక్కొక్కటి రూ. 2.5 కోట్లతో బస్సులను సరఫరా చేస్తోంది.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సులకు ప్రయాణీకుల ఛార్జీలు ప్రస్తుతం 9 మీటర్ల డీజిల్ బస్సుల్లో ప్రయాణించే ధరకు సమానంగా ఉంటాయి. మొదటి బస్సు గురువారం లేహ్‌కు చేరుకుంది. వీటి ట్రయల్స్ ఆగస్ట్ 15 సందర్భంగా ప్రారంభించాలని చూశారు. కానీ భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం కుదరలేదు. 2020 ఐ-డే ప్రసంగంలో కార్బన్-న్యూట్రల్ లడఖ్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ప్రధాని హైడ్రోజన్ బస్సులు పై ప్రకటించిన రెండేళ్లలోపు ఈ ప్రాజెక్ట్ పూర్తయింది.
"హిమాలయాల ఎత్తులో ఉన్న లడఖ్ కొత్త శిఖరాలకు పురోగమిస్తోంది. లడఖ్ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. మనం వాటిని సంరక్షించడమే కాదు, వాటిని మనం పెంచుకోవాలి. సిక్కిం 'సేంద్రీయ రాష్ట్రం'గా తన ముద్ర వేసింది. ఈశాన్య ప్రాంతంలో లడఖ్, లేహ్, కార్గిల్‌లు కూడా 'కార్బన్ న్యూట్రల్' యూనిట్‌గా తమ సొంత సముచిత స్థానాన్ని సృష్టించుకోగలవు "అని ప్రధాని 2020లో చెప్పారు.


Click it and Unblock the Notifications