US Visa News: అమెరికా కాలేజీల్లో ఉన్నతస్థాయి చదువులకు వెళ్లి ఎలాగొలా అక్కడే చిన్నగా స్థిరపడిపోవాలనేది చాలా మంది భారతీయ యువత కల. ఇందుకోసం చాలా ముఖ్యమైనది వీసా. అయితే ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న చాలా మంది స్పాన్సర్డ్ H-1B వీసాలపై అక్కడ నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీల నుంచి కీలక హెచ్చరిక కూడా రావటం గమనార్హం.
ఈ క్రమంలో యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కీలక ప్రకటన చేసింది. 2025 ఆర్థిక సంవత్సరానికి నిర్థేశించబడిన వీసా లిమిట్స్ కోసం తగిన దరఖాస్తులను తాము అందుకున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో H-1B వీసాల కోసం రెగ్యులర్ అప్లికెంట్స్ లిమిట్ 65,000 మార్కును, అలాగే యూఎస్ ఎడ్వాన్స్ డిగ్రీ హోల్డర్ల కోసం నిర్థేశించిన 20,000 వీసాల లిమిట్ చేరుకున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో సెలెక్ట్ అయినవారు, అవ్వనివారు వీసా అప్లికేషన్ స్టేటస్ గురించి సమాచారం అందుకుంటారని పేర్కొంది. ఈ క్రమంలో ఇంకా భారతీయులు అమెరికా వెళ్లటానికి వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చా లేదా అనే విషయంపై క్లారిటీ కోసం డైలమాలో ఉన్నారు.

వాస్తవానికి H-1B వీసా ప్రోగ్రామ్ అమెరికా యజమానులు తాత్కాలికంగా విదేశీ ఉద్యోగులను ప్రత్యేక వృత్తుల్లో నియమించుకోవడానికి అనుమతిస్తుంది. ఈ క్రమంలో వారికి సైద్ధాంతిక, ఆచరణాత్మక నైపుణ్యం అవసరం. దీనికోసం సదరు వ్యక్తులు బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతను కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, మెడిసిన్, ఎడ్యుకేషన్, బిజినెస్, లా అండ్ ఆర్ట్స్ వంటి వాటికి మాత్రమే పరిమితం కాకుండా దీనికింద అర్హత గల ఫీల్డ్‌లు ఉన్నాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం అమెరికాలోని దిగ్గజ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్, ఐబీఎమ్ వంటి ప్రముఖ కంపెనీలు 2024లో తక్కువ H-1B వీసాలను స్పాన్సర్ చేశాయని వెల్లడైంది. 2023 ఆర్థిక సంవత్సరంలో జారీ చేయబడిన మొత్తం 386,000 H-1B వీసాల్లో భారతీయ పౌరులు 72.3% దక్కించుకోవటం గమనార్హం.
ట్రంప్ గెలుపుతో విద్యార్థులకు హెచ్చరికలు..
జనవరి 20న అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న వేళ అమెరికాలోని యూనివర్సిటీలు అప్రమత్తం అయ్యాయి. 2017లో మెుదటి సారి ట్రంప్ గెలిచినప్పుడు ఎదురైన పరిస్థితుల దృష్యా తమ విదేశీ విద్యార్థులను ముందుగానే అప్రమత్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న విద్యార్థులు ట్రంప్ అధ్యక్షుడిగా జనవరిలో బాధ్యతలు చేపట్టే సమయానికి భౌతికంగా అమెరికాలో ఉండాలని సూచిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇతరదేశాల్లో ఉన్న తమ సిబ్బందికి కూడా ఇదే తరహా సూచనలు చేసాయి. ఈ క్రమంలో యేల్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్ ఆఫీస్ ఇటీవల ఇమ్మిగ్రేషన్ పాలసీ మార్పులపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి వెబినార్ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications