Hyderabad: రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..
హైదరాబాద్‌లోని రెండు రెస్టారెంట్లపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. ఫోస్కోస్ యాప్‌లో ఫిర్యాదులు అందడంతో దాడులు నిర్వహించారు. ఆదివారం ఫుడ్ సెఫ్టీ బృందం ఆహారం పరిశుభ్రత, ప్రాంగణం పరిశుభ్రతను అంచనా వేయడానికి రెండు రెస్టారెంట్లను తనిఖీ చేసింది. ఉప్పర్‌పల్లిలోని రాజేంద్ర నగర్‌లోని మెహ్రాబ్ రెస్టారెంట్‌లో తనిఖీలు చేశారు.
సంబంధిత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ FSS చట్టం, 2006, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, 2011 ప్రకారం ఉల్లంఘనలను గుర్తించారు.
అనంతరం ఆస్థలికి నోటీసులు జారీ చేస్తామని, తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంబర్‌పేటలోని నారాయణగూడలో ఉన్న ఇండియన్ దర్బార్ రెస్టారెంట్‌పై కూడా ఫిర్యాదు అందింది.

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఒకటైన ఈ ఫుడ్ అవుట్‌లెట్‌పై దాడి సందర్భంగా బృందం FSS చట్టం, 2006, నియమాలు, నిబంధనలు 2011 ప్రకారం ఉల్లంఘనలను గుర్తించింది. హైదరాబాద్‌లోని రెస్టారెంట్లతో పాటు తెలంగాణలోని పలు పాఠశాలలు, హాస్టళ్లలో ఇటీవల దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా, పరిపాలన, వంట సిబ్బందికి వంటగదిలో అనుసరించాల్సిన ప్రోటోకాల్‌లు, ఉత్తమ పద్ధతుల గురించి అవగాహన కల్పించారు.
గత కొన్ని నెలలుగా, టాస్క్‌ఫోర్స్ బృందం ఆహార నాణ్యతను నిర్ధారించడానికి వివిధ రెస్టారెంట్లు, హాస్టళ్లలో దాడులు నిర్వహిస్తోంది. అయితే హైదరాబాద్ లో రెస్టారెంట్లు, హాస్టళ్లలో పరిశుభ్రత ఘోరంగా ఉంది. చాలా రెస్టారెంట్లు కనీస శుభ్రతను పాటించడం లేదు. కొన్ని రెస్టారెంట్లలో నిన్న, మొన్నటి ఆహారం వడ్డిస్తున్నారు.


Click it and Unblock the Notifications