food safety: ఈ మధ్య కాలంలో బాబా రాందేవ్‌కు సంబంధించిన పతంజలికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రకటనలపై ఇటీవల సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. దీంతో బాబా ఓ మెట్టుదిగి ఎట్టకేలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా పతంజలికి మరో షాక్ తగిలింది.
ఉత్తరాఖండ్ పితోర్‌ఘర్ జిల్లాలోని దీదీహత్ నుంచి సుమారు నాలుగు సంవత్సరాల క్రితం తీసిన పతంజలి ప్యాక్డ్ తేనె నమూనాను జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ RK శర్మ టెస్టింగ్ కోసం సేకరించారు. ఆ పరీక్షలో పతంజలి తేనె విఫలమైంది. దీంతో సంబంధిత డిపార్ట్‌మెంట్ చర్యలకు ఉపక్రమించింది. ఏకంగా లక్ష జరిమానా విధించింది.

ప్యాక్ చేసిన తేనె నమూనా నాణ్యత లేనిదని తేలింది. అందులో సుక్రోజ్ రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. ప్రామాణిక 5 శాతానికి బదులు రెట్టింపు కంటే ఎక్కువగా 11.1 శాతం ఉన్నట్లు తెలిసింది. ఈ కేసులో దీదీహత్‌లోని విక్రయదారుడికి, రాంనగర్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ కంపెనీకి అధికారులు ఫైన్ వేశారు.
2020 జూలైలో ఈ నమూనాను సేకరించి రుద్రాపూర్‌లో ల్యాబ్‌కు అధికారులు పంపించారు. ఇక నవంబర్ 2021లో సంబంధిత విక్రేతపై డిపార్ట్‌మెంట్ దావా వేసింది. ఈ వ్యవహారంపై న్యాయమూర్తి జస్టిస్ ఏడీఎం డాక్టర్ ఎస్‌కే బరన్‌వాల్ తీర్పు చెప్పారు. ఉత్పత్తి విక్రేత కంపెనీకి 40 వేలు, సూపర్ స్టాకిస్ట్ మరో 60 వేలు జరిమానా వేశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications