KFC News: కేఎఫ్‌సీలో ఫుడ్ లాగిస్తున్నారా.. అయితే ఆగండి..! ముందు ఈ వార్త చదవండి

FSSAI on KFC: ఈరోజుల్లో బయటి ఆహారం తిననివాళ్లు అస్సలు ఉండరు. సరదాగా వారాంతంలో అయినా రెస్టారెంట్లకు, హోటళ్లకు వెళ్లటం ఇండియాలో సర్వసాధారణం. అయితే అలా తింటున్న ఆహారం ఎంత వరకు సేఫ్ అనే విషయమే ప్రతిసారీ చర్చకు వస్తోంది.

తాజాగా KFC అవుట్‌లెట్‌లో గురువారం మెగ్నీషియం సిలికేట్-సింథటిక్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా తూత్తుకుడి యూనిట్ ముంబైలోని రెస్టారెంట్ చెయిన్ ఇండియన్ హెడ్‌క్వార్టర్స్‌కు సమన్లు ​​జారీ చేసింది. తూత్తుకుడి అవుట్‌లెట్ KFC లైసెన్సీ, తిరుప్పూర్‌లోని KFC మెటీరియల్ గోడౌన్, ముంబైలోని KFC ప్రధాన కార్యాలయానికి నోటీసులు పంపబడ్డాయి. జూలై 8న FSSAI నియమించబడిన అధికారి ముందు హాజరు కావాలని కోరారు.

Food safety authority FSSAI issues notices to KFC over use of chemical to clean oil Know details

దీనిపై అమెరికాకు చెందిన రెస్టారెంట్ చైన్ KFC ఇండియా ఒక ప్రకటనలో తాము అత్యుత్తమ పద్ధతులు, అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. అధిక-నాణ్యత కలిగిన నూనె, చికెన్ ప్రసిద్ధ సరఫరాదారుల నుంచి తీసుకుంటున్నట్లు పేర్కొంది. అయితే మెగ్నీషియం సిలికేట్‌ని(MSS) క్లారిఫైయింగ్ ఏజెంట్‌గా ఉపయోగించటానికి FSSAI అనుమతి ఉందని పేర్కొంది.

అవుట్‌లెట్ నుండి అధీకృత బయోడీజిల్ డీలర్‌కు ఉపయోగించిన నూనెల పారవేయడం పరిమాణం తగ్గుతున్న నేపథ్యంలో తాము అవుట్‌లెట్‌లో ఆకస్మిక తనిఖీ చేశామని ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ మారియప్పన్ పేర్కొన్నారు. KFC రెస్టారెంట్ ప్రతి నెలా దాదాపు 1,350-1,500 లీటర్ల రిఫైన్డ్ ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్‌ను వినియోగిస్తున్నప్పటికీ, FSSAI అధీకృత ఉపయోగించిన ఆయిల్ అగ్రిగేటర్‌లకు నెలకు 100 లీటర్ల నూనె మాత్రమే తిరిగి ఇస్తోందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ ఉపయోగించలేము కాబట్టి అవుట్‌లెట్ ద్వారా ఉపయోగించిన నూనె నిర్వహణ గురించి తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఇక్కడ FSSAI ప్రమాణాలకు విరుద్ధంగా ఉపయోగించిన నూనెను పాలిష్ చేయడానికి లేదా శుభ్రం చేయడానికి MSS ఉపయోగించబడుతుందని వర్గాలు తెలిపాయి. రెస్టారెంట్లు వంటి ఆహార సేవల వ్యాపారాలలో MSS పాత్ర లేదు. ఉపయోగించిన నూనెలను శుద్ధి చేయడానికి లేదా పాలిష్ చేయడానికి FSSAI ఎటువంటి అథసివ్స్‌లను అనుమతించదు మారియప్పన్ చెప్పారు. రీసైకిల్ చేసిన ఆయిల్ వంటకు వినియోగించటం ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పారు. అలాగే మ్యారినేట్ చేసిన చికెన్ 12 గంటలలోపు వినియోగించాల్సి ఉండగా 24 గంటలు గడిచినా వాడుతున్నట్లు చికెన్ సీజ్ చేయటంపై వివరణ ఇచ్చారు.

ప్రస్తుతం శాంపిళ్లను ప్రయోగశాలకు పంపటంతో ఔట్‌లెట్ ను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. ఈ క్రమంలో వారు 18 కిలోల ఎంఎస్‌ఎస్, 45 లీటర్ల పాలిష్ యూజ్డ్ ఆయిల్, 56 కిలోల మెరినేట్ చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వంటనూనెను కెమికల్స్ తో క్లీన్ చేస్తున్నారనే ఆరోపణలతో FSSAI నుంచి KFC నోటీసులు అందుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+