కూరగాయల ధరలు మండి పోతున్నాయి. కొనబోతే కోరివి అన్నట్టుగా ప్రతి కూరగాయ ధర రూ.80 లకు పైనే ఉంది. సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పాడింది. ముఖ్యంగా, టమాటా పచ్చి మిర్చి ధర భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో టమాటా రూ. 100 నుంచి రూ.120 పలుకుతోంది. ఇక పచ్చి మిర్చి కిలో రూ.120 నుంచి రూ.140 పలుకుతోంది. మిగతా కూరగాయల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రెంచ్ బీన్స్ రూ. 175 -210, పచ్చిమిర్చి రూ.100-120, దొండకాయ రూ. 70-80, బీరకాయ రూ.80-100, బెండకాయ రూ.80-100, కాకరకాయ రూ.80, క్యారెట్ రూ.80, చామదుంప రూ.60 గా ఉన్నాయి.
ఆకు కూరల ధరలు కూడా భారీగానే పెరిగాయి. కొత్తిమీర కిలో రూ.230 పైనే ఉంది. ఇక ఉల్లి కూడా కన్నీరు పెట్టిస్తోంది. 20 క్రితం వరకు రూ.50 లకు రెండు కిలోల ఉల్లిగడ్డలు రాగా.. ప్రస్తుతం రూ.50 కిలో ఉల్లిగడ్డలే వస్తున్నాయి. అంటే ఉల్లి 100 శాతం పెరిగింది. వెల్లుల్లి ధర కూడా భారీగానే ఉంది. కిలో వెల్లుల్లి రూ.300 పైనే ఉంది. కూరగాయల ఉత్పత్తి తగ్గడం.. అదే సమయంలో డిమాండ్ పెరగడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. నెల రోజుల పాటు కూరగాయ ధరలు ఈ విధంగానే ఉంటాయని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.

కూరగాయల ధరలు ఎక్కువ ఉండడంతో పప్పు కొనేందుకు సిద్ధమవుతున్నారు సామాన్యులు అయితే పప్పుల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ఇక బియ్యం ధరలు ఎప్పటి నుంచో పెరుగుతోన్న సంగతి తెలిసిందే. కోడి గుడ్ల ధర కూడా భారీగానే ఉంది. కోడి ఒక్కటి రూ.6 నుంచి రూ.6.50 పలుకుతోంది. దీంతో సామాన్యుడు బతుకలేని పరిస్థితి నెలకొంది. కూరగాయ, పప్పులు, బియ్యం ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. దీంతో దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
మరోవైపు ఉల్లి ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. బఫర్ స్టాక్ విడుదల చేస్తోంది. ఇక కొత్త సాగు చేసిన కూరగాయ పంటలు చేతికి వస్తే కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications