దేశంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతోన్నాయి. దీంతో వ్యవసాయం పై ప్రభావం పడుతోంది. వేడి తీవ్రత కారణంగా కూరగాయల దిగుబడి తగ్గుతోంది. దీంతో కూరగాయల ధరలు భారీగా పెరుగుతోన్నాయి. దీంతో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ లో వర్షాలు కురిసే వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఆహార ఉత్పాదకత తగ్గి ద్రవ్యోల్బణం 30 నుంచి 50 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే పలు కూరగాయల ధర పెరిగింది. బీహార్‌లోనూ కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మార్కెట్‌లో టమాటా కిలో ధర రూ.60 చేరింది. వంకాయ కిలో రూ.50 పలుకుతోంది. బెండకాయ, బీరకాయ, చిక్కుడు కాయ ధరలు కూడా పెరిగాయి.

వడగాలుల వల్ల కూరగాయ పంటలు తీవ్ర దెబ్బతినే అవకాశం ఉంది. కూరగాయల ఉత్పత్తి తగ్గడంతోనే ధరలు పెరుగుతోన్నాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని డీబీఎస్ గ్రూప్ రీసెర్చ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఎకనామిస్ట్ అయిన రాధికా రావు తెలిపారు. వేడి తీవ్రత కారణంగా గ్రామీణ వ్యవసాయ ఆదాయం, ఆహార ద్రవ్యోల్బణం, సాధారణ ఆరోగ్య పరిస్థితులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు.
వచ్చే రోజుల్లో కూరగాయలతో పాటు ఆహార ధాన్యల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉంది. మొన్నటి వరకు కిలో రూ.20 టమాటా తాజాగా కిలో రూ.30 నుంచి రూ.40 పలుకుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications