Prices: వచ్చే రోజుల్లో సామాన్యుడు బతకడం కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
రాబోయో రోజుల్లో సామాన్యులు బతకడం కష్టంగా మారే అవకాశం ఉంది. వచ్చే ఆరు నెలల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే దేశంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్ లినో తో వర్షపాతం తగ్గిపోయింది. దీంతో ఈ సంవత్సరం వరి, గోధుమతో పాటు మిగతా పంటల దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉంది. దీంతో బియ్యం, గోధుమ పిండి, చక్కెర, పప్పుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ బియ్యం ధరలు భారీగా పెరిగాయి. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉల్లి ధరలు కూడా భారీగానే పెరిగాయి. దీంతో సామాన్యులు ఇప్పుడే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసరాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి.
సెప్టెంబర్ చివరి నాటికి హోల్‌సేల్ మార్కెట్‌లో బియ్యం ధర ఏడాది క్రితంతో పోలిస్తే దాదాపు 8.5% పెరిగి క్వింటాల్ రూ.4వేల 185కి చేరింది. ఇక సామాన్యుడు రోజువారీ వంటలో విరివిగా వాడే కందిపప్పు ధర కేజీ రూ.125 దాటిపోయింది. మినపప్పు సహా ఇతర పప్పు దినుసులు కూడా అవే బాటలో వెళ్తున్నాయి. వచ్చే ఆరు నెలల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 2026 చివరి నాటికి 'ఎల్‌నినో' ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. తిండి గింజల ఉత్పత్తి పడిపోయి ధరలు పెరుగుతాయని పేర్కొంది.

అయితే ఈ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద తగినంత ఆహార నిల్వలు, ప్రత్యామ్నాయ సాగునీటి వసతులు ఉండటం ఒక్కటే ప్రస్తుతం కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇండియా తన వంటనూనె అవసరాల కోసం భారీగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్, సోయాబీన్ ఆయిల్‌ను బయోడీజిల్ తయారీకి ఎక్కువగా మళ్లిస్తుండటంతో ధరలు పెరిగే ప్రమాదం అవకాశం ఉంది. దీనిని ముందే గమనించిన కేంద్ర ప్రభుత్వం.. ఇటీవల ముడి సోయాబీన్, పామాయిల్ దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని ఏకంగా జీరో చేసింది.
అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రజలను బయపెడుతోంది. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. భారత ఆయిల్ కంపెనీలు నష్టాలు భరిస్తూ.. తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అందిస్తున్నాయి. అయితే త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు పెరిగి సబ్బులు, సర్ఫులతో పాటు ఇతర నిత్యావసర ధరలు పెరిగే ప్రమాదం ఉంది. మొత్తంగా చెప్పాలంటే.. వచ్చే ఆరు నెలలు సామాన్యులకు గడ్డు పరిస్థితులు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
