Platform Fee Hike: దేశంలోని ఫుడ్ డెలివరీ వ్యాపారంలో దిగ్గజాలుగా ఇప్పటికే జొమాటో, స్విగ్గీ కొనసాగుతున్నాయి. ఈ స్టార్టప్ కంపెనీలు తమ వ్యాపార ప్రయాణాన్ని మెుదలుపెట్టి దాదాపు దశాబ్ధన్నర అవుతోంది. ఈ క్రమంలో కంపెనీలు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
వివరాల్లోకి వెళితే తాజాగా లీడింగ్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లైన జొమాటో, స్విగ్గీ తమ ప్లాట్‌ఫారమ్ రుసుమును పెంచాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో మెుదటగా బెంగళూరు, దిల్లీలో ఈ రేటును రూ.6కి పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి. వాస్తవానికి లాభదాయకంగా మారేందుకు గత కొన్ని నెలలుగా ఈ స్టార్టప్ కంపెనీలు రుసుమును క్రమంగా పెంచుకుంటూ పోతున్నాయి. ఇలా ఒక్కో ఆర్డరుకు వసూలు చేసే రుసుము నేరుగా కంపెనీకి వెళుతుంది. ఇది సదరు కంపెనీల ఆదాయాలను మెరుగుపరచటంలో దోహదపడుతుంది.

ప్రస్తుతం పెంచిన రుసుములు క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని డెలివరీ సర్వీస్ లొకేషన్లలోనూ విస్తరించబడతాయని తెలుస్తోంది. గతంలో సైతం కంపెనీ ఇటువంటి ప్రణాళికలనే అమలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న ప్లాట్‌ఫారమ్ ఫీజు రూ.5పై ప్రస్తుతం ఒక్కో ఆర్డరుకు రూ.1 పెరుగుదల కస్టమర్లపై పెద్దగా భారం కానప్పటికీ.. ఇది జొమాటోకు రోజూ రూ.22-25 లక్షల మేర ఆదాయాన్ని అందించవచ్చని తెలుస్తోంది. మెుత్తం మీద ఫుడ్ డెలివరీ కంపెనీలు ప్లాట్‌ఫారమ్ రుసుము వసూలు చేయడం ద్వారా రోజుకు రూ.1.25-1.5 కోట్ల అదనపు ఆదాయాన్ని చూస్తున్నాయి.
మెుదటిసారిగా స్విగ్గీ ఏప్రిల్ 2023లో రూ.2ను ప్లాట్‌ఫారమ్ రుసుముగా వసూలు చేయటం ప్రారంభించింది. తర్వాత ఆగస్టులో జొమాటో ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. తర్వాతి కాలంలో రద్దీ సమయాల్లో జొమాటో ప్లాట్‌ఫారమ్ రుసుముగా ఒక్కో ఆర్డర్‌కు రూ.9 వసూలు చేసింది. అలాగే స్విగ్గీ గతంలో నివేదించినట్లుగా బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లోని నిర్దిష్ట వినియోగదారుల కోసం రూ.10ని పరీక్షించింది. స్టార్టప్ కంపెనీలు రెండూ తమ ప్లాట్‌ఫారమ్ రుసుమును పెంచుతూ ఉంటారని, కస్టమర్ పుష్ బ్యాక్ లేదా ఆర్డర్ వాల్యూమ్‌లపై ప్రభావం ఉన్నప్పుడు నిలిపివేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతానికి స్విగ్గీ జొమాటోలు తమ ప్లాట్‌ఫారమ్ రుసుమును ఫుడ్ డెలివరీ వ్యాపారానికి పరిమితం చేశాయి. అయితే రానున్న రోజుల్లో క్విక్ కామర్స్ వెంచర్స్ అయిన ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్ లకు విస్తరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే వ్యాపారంలో ఉన్న జెప్టో ఈ ఏడాది మార్చిలో ప్లాట్‌ఫారమ్ రుసుమును ప్రవేశపెట్టిన తొలి కంపెనీగా నిలిచింది. ఒక్కో ఆర్డర్ పై రూ.2 ప్లాట్‌ఫారమ్ రుసుము రోజుకు రూ.11 లక్షల అదనపు ఆదాయాన్ని జెప్టోకి అందిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications