Zomato Shares: దేశీయ ఫుడ్ డెలివరీ స్టార్టప్ కంపెనీ జొమాటో షేర్లు నేడు మార్కెట్లో దాదాపు 5 శాతం క్షీణతను నమోదు చేశాయి. చాలా మంది ఇన్వెస్టర్లు నేడు జొమాటో షేర్లను విక్రయించేందుకు ఎగబడుతున్నారు.
విషయానికి వస్తే జొమాటో కంపెనీలోని చెందిన 19 కోట్ల షేర్లు అంటే కంపెనీలో దాదాపు 2.1 శాతం వాటాను యాంట్ ఫిన్ సింగపూర్ హోల్డింగ్స్ విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ బ్లాక్ డీల్ విలువ దాదాపు రూ.3,112 కోట్లుగా ఒక్కో షేరు యావరేజ్ ధర రూ.160గా జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి డీల్ కి ముందర కంపెనీలో యాంట్ ఫిన్ 6.42 శాతం వాటాను హోల్డ్ చేస్తుండగా.. అది డీల్ తర్వాత 4.42 శాతానికి తగ్గనుందని తెలుస్తోంది.

ఇంత భారీ మెుత్తంలో పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకోవటంతో దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. దీంతో చాలా మంది తమ వాటాలను విక్రయించేందుకు దిగటంతో స్టాక్ ఇంట్రాడేలో 4.55 శాతానికి పైగా క్షీణతను నమోదు చేసింది. వాస్తవానికి యాంట్ ఫిన్ సింగపూర్ చైనా ఈకామర్స్ దిగ్గజం ఆలీబాబా అనుబంధ పెట్టుబడి సంస్థ.
దీనికి ముందు సోమవారం నాడు జొమాటో కంపెనీ షేర్లు తమ కొత్త గరిష్ఠాలకు చేరుకుంది. ఫుడ్ డెలివరీ స్టార్టప్ లాభదాయకత పెరగటంతో పాటు భవిష్యత్తు వృద్ధిపై సానుకూలతలు షేర్ ధర పెరుగుదలకు కారణంగా నిలిచాయి. గడచిన మూడు నెలల కాలంలో కంపెనీ షేర్లు 42 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కంపెనీ ఆదాయాలు మెరుగుపడుతూ.. బలమైన పనితీరును కనబరుస్తున్న ప్రస్తుత తరుణంలో స్టాక్ ధరలు భారీగా పెరిగాయి. అందుకే ఇదే సరైన సమయంగా భావించిన యాంట్ ఫిన్ తన పెట్టుబడులను ఉపసంహరించుకుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం టెక్ ఆధారిత ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.1.46 లక్షల కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications