Zomato Q4 Results: దేశంలోని ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ వ్యాపారంలో ఉన్న స్టార్టప్ సంస్ధ జొమాటో నేడు తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ లాభదాయకంగా మారటంతో ఇన్వెస్టర్లు సంతోషంలో ఉన్నారు.
జొమాటో జనవరి-మార్చి త్రైమాసిక కాలానికి రూ.175 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. గత ఏడాది మార్చి త్రైమాసికంలో జొమాటో రూ.188 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఫుడ్ అగ్రిగేటర్ ఆదాయంలో వరుసగా నాలుగో త్రైమాసికంలో లాభదాయకంగా ఉంది. ఇ-కామర్స్ రంగం అధిక ద్రవ్యోల్బణం, మందగించిన డిమాండ్ ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 73 శాతం పెరిగి రూ.3,562 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.2,056 కోట్లుగా నమోదైంది.

ఫుడ్ డెలివరీ కంపెనీ స్టాక్ ధర దాని ప్రధాన వ్యాపారంలో లాభదాయకత పెరగడం, క్విక్ డెలివరీ విభాగం బ్లింకిట్ వేగవంతమైన వృద్ధి నేపథ్యంలో పుంజుకుంటోంది. అలాగే జొమాటోకు చెందిన Blinkit లాభాలు పెరుగుతాయని గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ అంచనా వేస్తోందని విశ్లేషకుడు మనీష్ అదుకియా ఇటీవలి నోట్‌లో రాశారు. గతంలో ఇన్వెస్టర్లు జొమాటో క్విక్ కామర్స్ ప్లాన్లపై అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ.. మెరుగుపడుతున్న ఆదాయాలు, తాజా ఫలితాలతో ఆందోళనలు తగ్గాయి.
కంపెనీ తాజాగా ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ ప్లాన్ కింద 18.2 కోట్ల షేర్లను కేటాయించేందుకు షేర్ హోల్డర్ల అనుమతి కోరింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ రూ.3,500 కోట్లుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. కొత్త ESOP ప్లాన్ ఆమోదించబడిన తర్వాత సాధారణంగా కొన్ని సంవత్సరాల్లో ఉద్యోగులకు మంజూరు చేయబడతాయి. తాజాగా మార్చి త్రైమాసికంలో జొమాటో స్టాక్ ఆప్షన్ ప్లాన్ ఖర్చు రూ.161 కోట్లకు పెరిగింది. గడచిన ఏడాది ఇదే సమయంలో ఇది కేవలం రూ.84 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications