కొత్త వ్యాపారంలోకి Zomato.. రిజర్వు బ్యాంక్ నుంచి గ్రీన్ సిగ్నల్.. ఇక స్టాక్ దూకుడే..
Zomato News: ప్రస్తుతం ఫుడ్ అగ్రిగేషన్ వ్యాపారంలో అగ్రగామిగా కొనసాగుతున్న జొమాటో మరో ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. కంపెనీ లాభదాయకంగా మారేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తాజా పరిణామాలు దోహదపడనున్నాయి.
వివరాల్లోకి వెళితే జొమాటో లిమిటెడ్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక సంతోషకరమైన వార్త అందుకుంది. రానున్న కాలంలో ఆన్‌లైన్ చెల్లింపు అగ్రిగేటర్‌గా పనిచేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి అవసరమైన ఆమోదాన్ని పొందింది. జనవరి 24, 2024 నుంచి అమలులోకి వచ్చే చెల్లింపు అగ్రిగేటర్, ప్రీ-పెయిడ్ చెల్లింపు సాధనాల జారీదారుగా పనిచేయడానికి సెంట్రల్ బ్యాంక్ అనుమతిని మంజూరు చేసింది.

కంపెనీ గత ఏడాది Zomato UPI అని పిలవబడే సొంత యూపీఐ వ్యవస్థను ప్రారంభించేందుకు ICICI బ్యాంక్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తమ ఫ్లాట్ ఫారమ్‌లలో చెల్లింపులకు ఇతర కంపెనీల యూపీఐ యాప్స్ వినియోగం అవసరం లేకుండా సులభతరం చేసేందుకు ఇది దోహదపడనుంది. అయితే తాజా పేమెంట్ అగ్రిగేటర్ అనుమతులు పొందటం వల్ల.. జొమాటో చెల్లింపులను టాటా పే, రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ వంటి ఇతర ప్రముఖ సంస్థలతో పోటీదారుగా నిలవనుంది.
రిజర్వు బ్యాంక్ తాజాగా అందించిన అనుమతులు జొమాటో ఆర్థిక సేవల విభాగాన్ని బలపరిచేందుకు దోహదపడనుంది. ప్లాట్‌ఫారమ్ దాని వినియోగదారులకు ఇంటిగ్రేటెడ్ చెల్లింపు పరిష్కారాలను అందించడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలు కంపెనీ షేర్లను సానుకూలంగా ప్రభావితం అయ్యేందుకు దోహదపడతాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications