Zomato Penalty: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటోకు మరో షాక్ తగిలింది. ఒకపక్క కంపెనీ లాభదాయకంగా మారేందుకు ప్రయత్నిస్తుండగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
తాజాగా జొమాటో రూ.184 కోట్లకు పైగా సర్వీస్ ట్యాక్స్ డిమాండ్, పెనాల్టీ ఆర్డర్‌ను పొందింది. కంపెనీ అక్టోబరు 2014 నుంచి జూన్ 2017 వరకు కాలానికి సర్వీస్ టాక్స్ చెల్లించనందుకు తాజా డిమాండ్ ఆర్డర్ పొందింది. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం విదేశీ అనుబంధ సంస్థలు, కంపెనీ బ్రాంచ్‌లు భారతదేశం వెలుపల ఉన్న తమ కస్టమర్‌లకు చేసిన కొన్ని విక్రయాల ఆధారంగా నిర్ణయించబడిందని కంపెనీ వెల్లడించింది.

కంపెనీ షోకాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా.. ఆరోపణలపై సపోర్టింగ్ డాక్యుమెంట్లు, న్యాయపరమైన పూర్వాపరాలతోపాటు వివరణ ఇచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి తోడు ఏప్రిల్ 1న దిల్లీ సెంట్రల్ ట్యాక్స్ కమీషనర్ (అడ్జుడికేషన్) ఆమోదించిన ఆర్డర్‌ను అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. అధికారుల నుంచి కంపెనీ రూ.92,09,90,306 సేవా పన్ను డిమాండ్ కు వర్తించే వడ్డీ, జరిమానాల రూపంలో మరో రూ.92,09,90,306 చెల్లిండాలని నోటీసులో ఉన్నట్లు జొమాటో వెల్లడించింది. ఆర్డర్‌కు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ వార్తల నేపథ్యంలో కంపెనీ స్టాక్ క్షీణతకు గురైంది. సాయంత్రం 3.14 గంటల సమయంలో జొనాటో షేర్లు ఎన్ఎస్ఈలో 2.79 శాతం క్షీణించి రూ.178 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. దీనికి ముందు జొమాటో ఫ్యూర్ వెజ్ అంటూ గ్రీన్ కలర్ ఫ్లీట్ ప్రారంభించటం పెద్ద వివాదానికి తెరలేపింది. వెజిటేరియన్ల కోసం ప్రత్యేక సేవలను ప్రారంభించటపై సోషల్ మీడియాలో ప్రశంసల కంటే విమర్శలు ఎక్కువగా వచ్చాయి. దీంతో కంపెనీ తాత్కాలికంగా ఈ అంశాన్ని పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications