Swiggy News: వినియోగదారులకు స్విగ్గీ షాక్.. ఫ్లాట్‌ఫారమ్ ఫీజు డబుల్..!!

Swiggy Updates: దేశంలోని అగ్ర ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లలో ఒకటిగా ఉన్న స్విగ్గీ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మార్కెట్లో ఐపీవో ఫ్లోచ్ చేయాలనుకుంటున్న కంపెనీ వినియోగదారులకు మరోమారు షాక్ ఇచ్చేందుకు సిద్దమైందని చెప్పుకోవాలి.

ఇప్పటికే జొమాటో తన ఐపీవోను మార్కెట్లోకి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ గత కొంత కాలంలో లాభాల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు పనిచేస్తున్నారు. మరికొన్ని త్రైమాసికాల్లో పూర్తిగా నష్టాల నుంచి లాభాల బాట పట్టేందుకు కంపెనీ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ పరిణామంతో స్విగ్గీ సైతం తన లాభదాయకతపై ప్రస్తుతం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

 Food Delivery Startup Swiggy planning to increase platform fee to 10 rupees per order

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన ఫ్లాట్ ఫారమ్ ఫీజును ప్రస్తుతం ఉన్న రూ.5 నుంచి ఆర్డర్ కు రూ.10కి అంటే 100 శాతం పెంచాలని చూస్తోందని వెల్లడైంది. ఈ నిర్ణయం ద్వారా కంపెనీ తన నష్టాలను గణనీయంగా తగ్గించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కంపెనీ ఈ రుసుమును తొలిసారిగా 2023 ఏప్రిల్ లో నామమాత్రపు రూ.2తో ప్రారంభించింది. అయితే ఆ తర్వాతి కాలంలో దానిని రూ.5కు పెంచిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం దీనిని వినియోగదారులకు అలవాటు చేసే పనిలో కంపెనీ నిమగ్నమైంది. యాప్ ద్వారా ఫుడ్ ఆర్టర్ చేసిన వ్యక్తులకు ఫ్లాట్ ఫారమ్ ఫీజు రూ.10గా చూపిస్తూ దానిలో రూ.5 డిస్కౌంట్ అంటూ పాత ధరనే వసూలు చేస్తోంది. త్వరలోనే పెంచిన రుసుమును వినియోగదారుల నుంచి పూర్తిగా కలెక్ట్ చేసేందుకు ఇది తొలి అడుగని విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి స్టార్టప్ కంపెనీలు ప్రజలకు తమ సేవలు అలవాటయ్యేంత వరకు ఇలాంటి తగ్గింపులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, స్పెషల్ డిస్కౌంట్లు అంటూ అనేక తాయిలాలు పంచుతుంటాయని తెలిసిందే. అయితే దీనివల్ల రానున్న రోజుల్లో వినియోగదారుల నుంచి ఎలాంటి ప్రతిఘటన వస్తుందో వేచి చూడాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మార్కెట్లను పరిశీలిస్తే అన్ని రంగాలు ప్రస్తుతం మందగించాయి. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ మార్కెట్ చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు సీఈవో శ్రీహర్ష మాజేటి పేర్కొన్నారు. వాస్తవానికి కొన్ని నెలల్లో ఐపీవోను తీసుకురావాలని చూస్తున్న కంపెనీ తన వినియోగదారుల బేస్ పెంచుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+